Team India | భారత జట్టుకు ‘కాన్సులేట్ జనరల్’ ఆహ్వానం..!
Team India : ఐర్లాండ్‌లో పర్యటిస్తున్న భారత జట్టుకు ఆత్మీయ స్వాగతం లభించింది. బెల్ఫాస్ట్లోని భారత కాన్సులెట్ జనరల్ (Consulate General Of India) కార్యాలయం టీమిండియా స్క్వాడ్‌ను ఆహ్వానించింది.
Team India : ఐర్లాండ్‌లో పర్యటిస్తున్న భారత జట్టుకు ఆత్మీయ స్వాగతం లభించింది. బెల్ఫాస్ట్లోని భారత కాన్సులెట్ జనరల్ (Consulate General Of India) కార్యాలయం టీమిండియా స్క్వాడ్‌ను ఆహ్వానించింది. కాన్సులేట్ జనర్గా విధులు నిర్వహిస్తున్న కిరణ్ ఖత్రీ(Kiran Khatri) భారత క్రికెటర్లు, కోచింగ్ సిబ్బందిని ఆప్యాయంగా పలకరించింది. ఈ సందర్భంగా ప్రజలను క్రికెట్ ఎలా దగ్గర చేస్తుంది అనే అంశాన్ని కిరణ్ ఖత్రీ ప్రస్తావించారు.
బెల్ఫాస్ట్లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి ఆదివారం సాయంత్రం భారత క్రికెటర్ల బృందం..కోచింగ్ సిబ్బంది వెళ్లారు. కాన్సులేట్ జరనల్ కిరణ్ ఖత్రీ వీరికి అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం హెడ్‌కోచ్ గౌతం గంభీర్ సైతం ఇండియన్ క్రికెట్ గురించి మాట్లాడారు. ఆద్యంతం కోలాహలంగా సాగిన ఈ కార్యక్రమంలో ఐర్లాండ్‌లోని ప్రవాస భారతీయులు, విశిష్ట అతిథులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ ఫోటోలను బీసీసీఐ ఎక్స్ పోస్ట్‌లో పంచుకుంది.
An evening of warmth, camaraderie and the Indian spirit in Belfast. 🇮🇳
The Consulate General of India in Belfast (@CGIBelfast) welcomed #TeamIndia at a special reception hosted by Ms Kiran Khatri, Consul General of India. Joined by members of the Indian community and… pic.twitter.com/ckzyjOTI3B
— BCCI (@BCCI) June 28, 2026
34 పరుగుల తేడాతో
ఐర్లాండ్ పర్యటనను ఓటమితో ఆరంభించిన టీమిండియా ప్రతీకార విజయంతో సిరీస్ సమం చేయాలనే కసితో ఉంది. తొలి టీ20లో ప్రత్యర్థిని 182కే కట్టడి చేసిన భారత్.. ఛేదనలో తడబడింది. ఓపెనర్ అభిషేక్ శర్మ అర్ధశతకంతో రాణించినా.. అరంగేట్రం పేసర్లు మాథ్యూ హొలార్డ్(3-38), జై ముండ్రా(2-25) దెబ్బకొట్టారు. టీమిండియా బ్యాటర్ల సమిష్టి వైఫల్యం కారణంగా.. 34 పరుగుల తేడాతో గెలుపొందిన ఐర్లాండ్ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.
Ireland win the first T20I in Belfast by 34 runs.#TeamIndia will now aim to level the series on Sunday.
Scorecard ▶️ https://t.co/gdoXw2dAKR#IREvIND pic.twitter.com/kxnHM9ApeV
— BCCI (@BCCI) June 26, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

