ముంబై: స్పిన్ లెజెండ్, ఇండియన్ క్రికెట్లోని గొప్ప ప్లేయర్స్‌లో ఒకడు అనిల్ కుంబ్లే( Anil Kumble ) 51వ బర్త్ డే సందర్భంగా బీసీసీఐ అతనికి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా 1999లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్లో అతడు పాకిస్థాన్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన అరుదైన వీడియోను ట్విటర్లో షేర్ చేసింది. టెస్ట్ క్రికెట్లో ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన బౌలర్‌గా కుంబ్లే చరిత్ర సృష్టించాడు. ఇదే విషయాన్ని చెబుతూ.. 403 ఇంటర్నేషన్ మ్యాచ్‌లు, 956 వికెట్లు. టెస్ట్ క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన రెండో బౌలర్. టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది.
అటు టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా కుంబ్లేకు విషెస్ చెప్పాడు. పేరులోనూ, ప్రతిష్టలోనూ అతడు జంబోనే. అనిల్ కుంబ్లేకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. అతడో అద్భుతమైన మనిషి, ఆటగాడు, సీనియర్ అని యువీ ట్వీట్ చేశాడు. క్రికెట్లో కుంబ్లేకు జంబో అనే ముద్దు పేరు ఉన్న విషయం తెలిసిందే. ఇండియన్ టీమ్‌కు కెప్టెన్‌గానే కాకుండా కోచ్‌గా కూడా వ్యవహరించిన ఘనత కుంబ్లేది. మొత్తం 132 టెస్టుల్లో 619 వికెట్లు తీసిన కుంబ్లే.. ఈ ఫార్మాట్లో ఇండియా తరఫున అత్యధిక వికెట్ల రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇక 271 వన్డేల్లో 337 వికెట్లు తీశాడు. మురళీధరన్, షేన్ వార్న్, జేమ్స్ ఆండర్సన్ తర్వాత టెస్టుల్లో నాలుగో అత్యధిక వికెట్ల వీరుడు కుంబ్లే.
4⃣0⃣3⃣ intl. games 👍
— BCCI (@BCCI) October 17, 2021
9⃣5⃣6⃣ intl. wickets 👌
Only the second bowler in Test cricket to scalp 10 wickets in an innings 👏
Wishing former #TeamIndia captain @anilkumble1074 a very happy birthday. 🎂 👏
Let's revisit his brilliant 1⃣0⃣-wicket haul against Pakistan 🎥 🔽 pic.twitter.com/BFrxNqKZsN
Jumbo by name and jumbo by fame! Here's wishing a very Happy Birthday to @anilkumble1074 – a fantastic sportsman, senior and human being. Hope the year ahead is full of happiness, good health and success. Lots of love and good wishes pic.twitter.com/rNxYDNn1FA
— Yuvraj Singh (@YUVSTRONG12) October 17, 2021