 
                                                            ముంబై : మరికొద్దిరోజుల్లో దక్షిణాఫ్రికాతో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సరికొత్త సంప్రదాయానికి తెరలేపనుంది. టెస్టు మ్యాచ్‌ల్లో లంచ్ తర్వాత ఉండే టీ బ్రేక్‌ను.. భోజన విరామానికి ముందే నిర్వహించేందుకు సిద్ధమైంది. అంతేగాక భారత్‌లో టెస్టులు ఉదయం 9:30 గంటలకు మొదలై సాయంత్రం 4:30 గంటలకు ముగియాల్సి ఉండగా రెండో టెస్టు జరగాల్సిన గువహతిలో మాత్రం మ్యాచ్ 9 గంటలకే ప్రారంభమై 4 గంటలకే ముగిసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఈశాన్య రాష్ట్రమైన అసోంలో వాతావరణమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. అక్కడ సాయంత్రం 4:30 గంటలకే సూర్యాస్తమయం అవుతుంది. ఈ నేపథ్యంలో ఉదయం సెషన్ 9-11 వరకు జరుగనుండగా 11-11:30 మధ్య టీ బ్రేక్ ఉండనుంది. అనంతరం రెండో సెషన్ మొదలై 11:20 నుంచి 1:20 వరకు ఆడాక లంచ్ విరామం ఇస్తారు. ఇక 2-4 గంటల వరకు మూడో సెషన్‌తో ఆట ముగుస్తుంది. దీనిపై బీసీసీఐ గానీ, అసోం క్రికెట్ అసోసియేషన్ గానీ అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ సంప్రదాయం ఒక్క గువహతి వరకే ఉంటుందా? లేక మిగిలిన సిరీస్‌లకూ కొనసాగిస్తారా? అన్నదానిపై స్పష్టత లేదు.
 
                            