BCCI : స్వదేశంలో మరో 9 రోజుల్లో మహిళల వన్డే ప్రపంచ కప్ మొదల్వనుంది. సెప్టెంబర్ 30న ఆరంభ వేడుకల అనంతరం మెగా టోర్నీ షురూ కానుంది. ఈ సందర్భంగా దివంగత సింగర్ జుబిన్ గార్గ్(Zubeen Garg)కు నివాళులు అర్పించనుంది బీసీసీఐ. ఈ విషయాన్ని ఆదివారం సెక్రటరీ దేవజిత్ సైకియా (Devajit Saikia) వెల్లడించాడు. ఇటీవలే సింగపూర్లో స్కూబా డైవింగ్ ప్రమాదంలో జుబీన్ మరణించిన విషయం తెలిసిందే.
‘అస్సాం గాయకుడు జుబిన్ గార్గ్ అకాల మరణంతో ఆ రాష్ట్ర ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈశాన్య ప్రాంతంలో ప్రముఖ వ్యక్తుల్లో ఒకరైన జుబిన్ను గౌరవించాలనుకుంటున్నాం. అందుకే.. మహిళల వన్డే వరల్డ్ కప్ ఆరంభ వేడుకల సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించాలనుకుంటున్నాం. ఈ మేరకు అస్సాం క్రికెట్ సంఘం, భారత క్రికెట్ నియంత్రణ మండలి మధ్య అవగాహన కుదిరింది. తద్వారా జుబిన్ను గౌరవించడమే కాకుండా ఆయనకు నివాళులు అర్పిస్తాం’ అని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ పేర్కొన్నాడు.
#WATCH | Mumbai: BCCI Secretary Devajit Saikia says, “…Recently, the music icon of Assam, Zubeen Garg passed away. Today, his mortal remains have arrived in Guwahati and it will be kept for 1-2 days for public homage. There is massive grief in Assam. So, keeping in consonance… pic.twitter.com/llBMjva7yM
— ANI (@ANI) September 21, 2025
వరల్డ్ కప్ ఆరంభ పోరులో ఆతిథ్య జట్లు భారత్, శ్రీలంక తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు ముందు 40 నిమిషాల పాటు జుబిన్ స్మారక కార్యక్రమం జరుగనుంది. అలానే బాలీవుడ్ సింగర్ శ్రేయా ఘోషల్ తన మధురమైన గాత్రంతో అభిమానులను రంజింపజేయనుంది.