BCCI | దేవ్జిత్ సైకియా కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత.. ఆయన స్థానంలో కొత్త జాయింట్ సెక్రెటరీని నియమించేందుకు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) మార్చి 1న ముంబైలో ప్రత్యేక సర్వసభ్య సమావేశం (SGM)ను ఏర్పాటు చేసింది. గత నెలలో అసోం క్రికెట్ అసోసియేషన్ (ACA)కి చెందిన సైకియా కార్యదర్శిగా నియమించింది. డిసెంబర్ 1న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అధ్యక్షుడిగా జై షా బాధ్యతలు స్వీకరించిన విషయం విధితమే. ఎస్జీఎం కోసం రాష్ట్ర సంఘాలకు బీసీసీఐ పంపిన నోటీసులో ఏకైక ఎజెండా ‘జాయింట్ సెక్రటరీ నియామకం’గా పేర్కొంది. మార్చి 1న మధ్యాహ్నం 12 గంటలకు ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జాయింట్ సెక్రటరీ ఎన్నిక, నియామకం కోసం జరగనుంది ఎంజీఎం జరుగుతుందని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) మాజీ అధ్యక్షుడు అభిషేక్ దాల్మియా (తూర్పు జోన్), ఢిల్లీ అండ్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (DDCA) చీఫ్ రోహన్ జైట్లీ (నార్త్ జోన్), ముంబయి క్రికెట్ అసోసియేషన్ (MCA) సంజయ్ నాయక్ (వెస్ట్ జోన్) పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. బీసీసీఐ కార్యదర్శి, కోశాధికారి మాదిరిగానే.. బోర్డు కొత్త జాయింట్ సెక్రటరీ కోసం ఎన్నికలు నిర్వహించరు. నిబంధనల ప్రకారం.. ఎస్ఎంజీని పిలవాల్సి ఉంటుంది. బీసీసీఐ గతంలో జనవరి 12న ఎస్టీఎంని పిలిచి.. కార్యదర్శిగా సైకియాను.. కోశాధికారిగా ప్రభతేజ్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది.