Impact Rule | మళ్లీ తెరపైకి ‘ఇంప్యాక్ట్ రూల్’.. ఫ్రాచైంజీల అభిప్రాయం కోరిన బీసీసీఐ.!
Impact Rule : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో హాట్‌టాపిక్ అయిన 'ఇంప్యాక్ట్ రూల్' (Impact Rule) మళ్లీ తెరపైకి వచ్చింది. వివాదాస్పదంగా మారిన ఈ నియమంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) తాజాగా ఫ్రాంచైజీల అభిప్రాయం కోరింది.
Impact Rule : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో హాట్‌టాపిక్ అయిన ‘ఇంప్యాక్ట్ రూల్’ (Impact Rule) మళ్లీ తెరపైకి వచ్చింది. మూడేళ్లుగా వివాదాస్పదంగా మారిన ఈ నియమంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) తాజాగా ఫ్రాంచైజీల అభిప్రాయం కోరింది. ప్రతి సీజన్లో ఈ నిబంధనను కొందరు ఆటగాళ్లు విమర్శిస్తుండగా.. మరికొందరు మద్దతిస్తున్నందున ఇంప్యాక్ట్పై తమతమ ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలని తెలిపింది బీసీసీఐ. ఈ అంశంతో పాటు మరిన్ని విషయాలపై కూడా పది జట్ల యాజమాన్యం అభిప్రాయాలను కోరింది భారత బోర్డు.
ఐపీఎల్లో ఆల్‌రౌండర్ల పాలిట శాపంలా మారిన ఇంప్యాక్ట్ నిబంధనపై బీసీసీఐ అభిప్రాయ సేకరణకు సిద్ధమైంది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శుభ్‌మన్ గిల్ వంటి స్టార్లు ఈ నియమంపై వ్యతిరేకత వ్యక్తం చేసినందున.. మరో సీజన్లో దీన్ని ఉంచాలా? వద్దా? అనేదానిపై బీసీసీఐ ఆలోచిస్తోంది. ఈ క్రమంలోనే ఈ మెగా లీగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా 2023లో ప్రవేశ పెట్టిన ఈ నియమంపై తమ నిర్ణయాన్ని తెలపాలని ఫ్రాంచైజీలను కోరింది బీసీసీఐ.
BREAKING 🚨
The Board of Control for Cricket in India has sought feedback from IPL franchises on the much-debated Impact Player rule.
The board has sought the franchises’ views on several other issues as well, including PMOA matters, umpiring, practice sessions and playing… pic.twitter.com/K7S2BpgdSA
— Cricbuzz (@cricbuzz) August 30, 2026
అంతేకాదు ప్లేయర్లు.. మ్యాచ్ అధికారులు ప్రాంతం(PMOA), అంపైరింగ్, ప్రాక్టీస్ సెషన్.. ఆటకు అనువైన పరిస్థితులు.. వీటిపై కూడా ఫ్రాంచైజీల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోనుంది. ఆగస్టు 31, సోమవారం లోగా తమ స్పందన తెలియజేయాలని పది జట్లకు గడువు విధించింది బీసీసీఐ. ఫ్రాంచైజీల నుంచి అందిన రివ్యూలను బట్టి వచ్చే సీజన్లో అవసరమైన చర్యలు తీసుకోనుంది బోర్డు. అలానే 19వ సీజన్లో విమర్శలకు కేంద్రంగా మారిన ప్లేయర్లు, మ్యాచ్ అధికారుల ప్రాంతంలోకి ఇతరుల ప్రవేశంపై కూడా బీసీసీఐ కఠినమైన చర్యలు తీసుకోనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- BCCI
- hardik pandya
- Impact' rule
- ipl
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

