గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Nov 21, 2020 , 18:21:04

సిరాజ్‌పై గంగూలీ ప్ర‌శంస‌ల వ‌ర్షం

సిరాజ్‌పై గంగూలీ ప్ర‌శంస‌ల వ‌ర్షం

ముంబై:  టీమిండియా పేస్ బౌల‌ర్‌, హైద‌రాబాదీ మ‌హ్మ‌ద్ సిరాజ్‌పై బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. త‌న తండ్రి చ‌నిపోయాడ‌ని తెలిసినా ఇండియాకు తిరిగి రాకుండా, ఆస్ట్రేలియాలో టీమ్‌తోనే ఉండాల‌ని అత‌డు తీసుకున్న నిర్ణ‌యాన్ని ప్ర‌శంసించాడు. ఆస్ట్రేలియా టూర్‌లో అత‌డు స‌క్సెస్ సాధించాల‌ని కోరుతూ శనివారం ఓ ట్వీట్ చేశాడు. సిరాజ్ తండ్రి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతూ శుక్ర‌వారం మ‌ర‌ణించాడు. సిరాజ్ స్టార్ క్రికెట‌ర్ కాక‌ముందు 53 ఏళ్ల అత‌డి తండ్రి ఆటో న‌డిపేవాడు. సిరాజ్ టీమిండియా త‌ర‌ఫున వ‌న్డేలు, టీ20లు ఆడినా.. వ‌న్డేల్లో ఇంకా వికెట్ల బోణీ చేయ‌లేదు.