BCCI : భారత ఆటగాళ్లకు క్రికెట్ బోర్డు(BCCI) త్వరలోనే గుడ్‌న్యూస్ చెప్పనుంది. టెస్టు ఫార్మాట్(Test Cricket) మ్యాచ్ ఫీజు పెంపుపై కసరత్తు చేస్తోంది. ఒక సీజన్లో టెస్టు సిరీస్ మొత్తం ఆడిన ప్లేయర్లకు బోనస్ కూడా చెల్లించేందుకు భారత క్రికెట్ బోర్డు సిద్ధమవుతోంది. ఎందుకంటే..? ఈ మధ్య కాలంలో సదీర్ఘ ఫార్మాట్లో ఆడేందుకు యువ క్రికెటర్లు ఆసక్తి చూపడం లేదు.
జట్టులో రావడానికి ముందు రంజీల్లో ఆడడం తప్పనిసరి అని చెప్పినా సరే ఇషాన్ కిషన్(Ishan Kishan)తో పాటు శ్రేయస్ అయ్యర్లు పెడచెవిన పెడుతున్నారు. మరోవైపు ఇంగ్లండ్ సిరీస్‌లో అరంగేట్రం కుర్రాళ్లు ధ్రువ్ జురెల్(Dhruv Jurel), సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan)లు అదరగొట్టారు. అందుకని జురెల్, సర్ఫరాజ్ వంటి యువ ఆటగాళ్లను ప్రోత్సహిచేందుకు మ్యాచ్ ఫీజు పెంచడమే మార్గమని బీసీసీఐ పెద్దలు నిర్ణయానికి వచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి.
సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్
ప్రపంచంలోని ధనిక బోర్డు అయిన బీసీసీఐ క్రికెటర్లకు సెంట్రల్ కాంట్రాక్ట్ ద్వారా ఏటా కోట్ల రూపాయలు ముట్టజెప్పుతోంది. సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఏ ప్లస్, ఏ, బీ, సీ అని నాలుగు కేటగిరీలు ఉన్నాయి. ఏ ప్లస్‌లో ఉన్నస్టార్ ఆటగాళ్లు ఏటా రూ.7 కోట్లు అందుకున్నారు. ఏ కేటగిరీలోని ఆటగాళ్లు రూ.5 కోట్లు, బీ కేటగిరీలోని వాళ్లు రూ.3 కోట్లు, సీ కేటగిరీవాళ్లు రూ.1 కోటి ఆర్జిస్తున్నారు.
ఏ+ – విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.
ఏ – హార్దిక్ పాండ్యా, అశ్విన్, షమీ, రిషభ్ పంత్, అక్షర్ పటేల్.
బీ – పూజారా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్.
సీ – కుల్దీప్ యాదవ్, చాహల్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శ్రీకర్ భరత్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్, శిఖర్ ధావన్, ఉమేశ్ యాదవ్,