దక్షిణాఫ్రికా సిరిస్‌కు నేడు భారత్ జట్టు ఎంపిక
BCCI Likely to Announce India Squad For South Africa Tour Today | దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత జట్టును బీసీసీఐ నేడు ప్రకటించనున్నది. ఈ పర్యటనలో ఆతిథ్య జట్టుతో భారత్ మూడు టెస్టులు, మూడు వన్డేలు,

ముంబై : దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత జట్టును బీసీసీఐ నేడు ప్రకటించనున్నది. ఈ పర్యటనలో ఆతిథ్య జట్టుతో భారత్ మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ-20 మ్యాచ్‌లు ఉడాల్సి ఉన్నది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళనల మధ్య టీ-20 మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. టెస్టు జట్టులోకి ఛతేశ్వర్ పూజారాతో పాటు అజింక్యా రహానేను జట్టులోకి ఎంపిక చేసే అవకాశం ఉన్నది.
ఇటీవల కాలంలో పేలవమైన ఫామ్‌ను కొనసాగిస్తూ వస్తున్న క్రమంలో జట్టులో రహానే స్థానం ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది డిసెంబర్లో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో రహానే ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించగా.. ఆ తర్వాత రెండు అర్ధ సెంచరీలు మాత్రమే చేశాడు. 29 ఇన్నింగ్స్‌ల్లో సగటు 20 మధ్యనే ఉన్నది. ప్రస్తుతం ఫామ్‌తో సతమతమవుతున్న వైస్ కెప్టెన్ అజింక్యా రహానే తుదిజట్టు 11 మందిలో చోటు కష్టమే. ప్రస్తుతం మిడిలార్డర్లో శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, హనుమ విహారితో గట్టీ పోటీ ఎదురవుతున్నది.
ఇక రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ రాహుల్ ఇన్సింగ్స్‌ను ప్రారంభించి అవకాశం ఉంది. అలాగే వికెట్ కీపర్, బ్యాట్‌మెన్ రిషబ్ పంత్ జట్టులోకి తిరిగి రానున్నాడు. పేసర్లు మహ్మద్ షమీ, జత్ప్రీత్ బుమ్రా పేస్ అటాక్‌కు నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఉమేశ్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణను దక్షిణాఫ్రికా సిరిస్‌కు ఎంపిక లాంఛనం కాగా.. 105 టెస్టుల్లో 311 తీసిన అనుభవనం ఉన్న సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

