K Jayaram : భారత జట్టు మాజీ సెలెక్టర్(BCCI Fomer Selector), కార్తిక్ జయరామ్(Kartik Jairam) కన్నుమూశాడు. కేరళ రంజీ జట్టు కెప్టెన్‌గా చెరగని ముద్ర వేసిన ఆయన గుండెపోటు(Heart attack)తో శనివారం ప్రాణాలు విడిచాడు. అతడి మృతిపట్ల బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని(Roger Binny)తో సహా కేరళ క్రికెట్ పెద్దలు సంతాపం వ్యక్తం చేశారు. ‘అప్పట్లో కేరళ జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉండేవాళ్లు కాదు. కానీ, జయరామ్ మాత్రం చాలా ప్రత్యేకం.
అతనొక అద్భుతమైన క్రికెటర్. అంతకుమించి ఒక మంచి మనిషి. సెలెక్టర్‌గా ఎప్పుడూ ప్రతిభావంతులైన క్రికెటర్ల కోసం అన్వేషిస్తూ ఉండేవాడు. అతడి మరణవార్త నన్ను ఎంతగానో కలిచి వేసింది’ అని రోజర్ బిన్ని ఒక ప్రకటనలో తెలిపాడు. టీమిండియా సెలెక్టర్ అవ్వడానికి ముందు అతను కేరళ రంజీ జట్టు(Kerala Ranji Team) కెప్టెన్‌గా సేవలందించాడు.
జయరామ్ కేరళలోని ఎర్నాకులం పట్టణంలో జన్మించాడు. దేశవాళీలో అతను 42 మ్యాచ్‌ల్లో కేరళకు ప్రాతినథ్యం వహించాడు. అంతేకాదు 1981 – 83 మధ్య కాలంలో అతను కేరళ జట్టును నడిపించాడు. 1985-86లో జరిగిన రంజీ ట్రోఫీ(Ranji Trophy)లో జయరామ్ అద్భుంతగా రాణించి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. కేరళ నుంచి భారత జట్టులో స్థానానికి గట్టి పోటీనిచ్చిన మొదటి క్రికెటర్ అతనే. అయితే.. అదృష్టం కలిసిరాకపోవడంతో అతడి కల కలగానే మిగిలింది. అయినా జయరామ్ నిరాశ చెందలేదు.
అప్పట్లో దులీప్ ట్రోఫీ(Duleep Trophy)లో సౌత్ జోన్‌కు ఆడిన జయరామ్ చాంపియన్ ప్లేయర్‌గా వార్తల్లో నిలిచాడు. కుడి చేతివాటం బ్యాటర్ అయిన జయరామ్ దేశవాళీలో 29.47 సగుటుతో 2,358 పరుగులు సాధించాడు. అందులో 5 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బ్యాటర్‌గానే కాకుండా పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గానూ అతను జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాడు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాక జూనియర్ జట్టు సెలెక్టర్‌గా, కేరళ సీనియర్ టీమ్ చీఫ్ సెలెక్టర్‌గా కొనసాగాడు.