BCCI | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రాబోయే దేశవాళీ సీజన్ షెడ్యూల్‌ను ప్రకటించింది. 2023-24 దేశవాళీ సీజన్ జూన్ 28న దులీప్ ట్రోఫీ టోర్నమెంట్‌తో షురూకానున్నది. ప్రతిష్టాత్మక రంజీ ట్రోపీ వచ్చే ఏడాది జనవరి 5 నుంచి మొదలవనున్నది. గత సీజన్లో సౌరాష్ట్ర జట్టు రంజీ ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. బెంగాల్‌ను ఓడించి ట్రోఫీని ఎగరేసుకొనిపోయింది. ఆరు ప్రాంతీయ
జట్ల ప్రాంతీయ జట్ల మధ్య దులీప్ ట్రోఫీ జరుగనున్నది. ఆ తర్వాత దేవధర్ ట్రోఫీ లిస్ట్-ఏ టోర్నమెంట్ (జూలై 24-ఆగస్టు 3), ఇరానీ కప్ (అక్టోబర్ 1-5), సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ పురుషుల T20 నేషనల్ ఛాంపియన్షిప్ (అక్టోబర్ 16-నవంబర్ 6), విజయ్ హజారే వన్డే ట్రోఫీ (నవంబర్ 23-డిసెంబర్ 3) టోర్నమెంట్ జరుగనున్నది.
రంజీ ట్రోఫీ సీజన్లో సీజన్లో భాగంగా ఎలైట్ గ్రూప్‌లోని లీగ్ దశ మ్యాచ్‌లు జనవరి 5 నుంచి ఫిబ్రవరి 19 వరకు జరుగుతాయి. నాకౌట్ దశ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు జరుగుతుంది. ఈ టోర్నమెంట్ 70 రోజుల పాటు కొనసాగనున్నది. ప్లేట్ గ్రూప్ లీగ్ మ్యాచ్‌లు జనవరి 5 నుంచి ఫిబ్రవరి 5 వరకు.. నాకౌట్ దశ ఫిబ్రవరి 9 నుంచి 22 వరకు కొనసాగుతాయి. ఎలైట్ విభాగంలో నాలుగు గ్రూప్‌లలో ఎనిమిది జట్లు ఉంటాయి. ప్రతి గ్రూప్ నుంచి మొదటి రెండు జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ప్లేట్ గ్రూప్‌లోని ఆరు జట్లలో మొదటి నాలుగు జట్లు సెమీ-ఫైనల్‌కు వెళ్తాయి. ఈ గ్రూప్‌లో ఫైనల్‌కు చేరిన రెండు జట్లు రాబోయే సీజన్లో (2024-25) ఎలైట్ గ్రూప్‌లో చోటు దక్కుతుంది.
ఇక అక్టోబర్ 19 నుంచి సీనియర్ వుమెన్స్ సీజన్ ప్రారంభం కానున్నది. 19 నుంచి నవంబర్ 9 వరకు జాతీయ టీ20 ఛాంపియన్‌షిప్‌తో ప్రారంభంకానున్నది. ఆ తర్వాత నవంబర్ 24 నుంచి డిసెంబర్ 4 వరకు ఇంటర్ జోన్ T20 ట్రోఫీ జరుగుతుంది. సీనియర్ మహిళల వన్డే ట్రోఫీ జనవరి 4 నుంచి 26 వరకు జరుగుతుంది. సీనియర్ మహిళల టీ20 ట్రోఫీ, వన్డే ట్రోఫీలో ఐదు గ్రూపులు ఉంటాయి. రెండు గ్రూపుల్లో ఎనిమిది జట్లు, మిగిలిన మూడు గ్రూపుల్లో ఏడు జట్లు ఉంటాయి. ఒక్కో గ్రూపులో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి. గ్రూప్ మ్యాచ్‌ల తర్వాత, ఈ 10 జట్లలో మొదటి ఆరు జట్లు క్వార్టర్-ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. చివరి నాలుగు జట్లు చివరి ఎనిమిది స్థానాల్లో స్థానం కోసం ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచులు ఆడతాయి.