న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ మార్పులు చేయాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అభ్యర్థనను బీసీసీఐ తోసిపుచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో షెడ్యూల్ మార్చే అవకాశం లేదంటూ బోర్డు సోమవారం అధికారిక ప్రకటన చేసింది. ఆసియాకప్ కోసం జాతీయ జట్టు ఎంపిక కోసం వచ్చిన కార్యదర్శి జై షా..హెచ్సీఏ ప్రతినిధులతో చర్చించి ఈ నిర్ణయం ప్రకటించారు. ఈ నెల 9న విడుదలైన షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్లు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.