BCCI | సెలక్టర్ల ఎంపిక కోసం ముగ్గురితో అడ్వైజరీ కమిటీ.. చోటు దక్కించుకున్న మహిళా క్రికెటర్
ఆర్ఫీ సింగ్, మదన్‌లాల్ స్థానంలో మల్హోత్రా, జతిన్లను ఎంపిక చేసిన బీసీసీఐ
BCCI : కొత్త సెలక్లన్ కమిటీ కోసం బీసీసీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త సెలెక్టర్ల ఎంపిక కోసం ముగ్గురితో అడ్వైజరీ కమిటీ (సీఏసీ)ని బీసీసీఐ నియమించింది. ఈ కమిటీలో మాజీ టెస్ట్ క్రికెటర్ అశోక్ మల్హోత్రా, మాజీ సెలక్టర్ జతిన్ పరంజపే, సులక్షణ నాయక్ ఉన్నారు. ప్రస్తుతం అడ్వైజరీ కమిటీలో సభ్యులుగా ఉన్న ఆర్ఫీ సింగ్, మదన్‌లాల్ స్థానంలో మల్హోత్రా, జతిన్లను తీసుకుంది. మదన్‌లాల్‌కు 70 ఏళ్లు పైబడడంతో అతని ప్లేస్‌లో మల్హోత్రాకు చోటు లభించింది. ఆర్పీ సింగ్ ఐపీఎల్ ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీలో టాలెంట్ స్కౌట్‌గా చేరాడు. దాంతో, అతని స్థానంలో జతిన్‌ను ఎంపిక చేసింది. ఇండియా తరఫున సులక్షణ నాయక్ రెండు టెస్టులు, 46 వన్డేలు, 31 టీ20 మ్యాచ్‌లు ఆడింది.
అడ్వైజరీ కమిటీకి అశోక్ మల్హోత్రా హెడ్. ఈ కమిటీసభ్యులు టీమిండియాకు కొత్త సెలక్టర్లను ఎంపిక చేయనున్నారు. వచ్చిన దరఖాస్తుల్లో కొందరిని షార్ట్ లిస్ట్ చేసి, వాళ్లకు ఇంటర్వ్యూ నిర్వహించి, కొత్త సెలక్టర్లను ఎంపికచేయడం ఈ కమిటీ బాధ్యత. టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా సెమీఫైనల్లో ఓడిపోవడంతో చేతన్ శర్మ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దాంతో ఆ కమిటీపై బీసీసీఐ వేటు వేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

