BCCI : పంతొమ్మిదో సీజన్ ఐపీఎల్లో కొందరు భారత క్రికెటర్ల వ్యవహారం దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. స్టేడియంలోనే కాకుండా.. టీమ్ బస చేసే హోటల్లోనూ హార్దిక్ పాండ్యా(Hardik Pandya), ఇషాన్ కిషన్(Ishan Kishan), యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal), అర్ష్‌దీప్ సింగ్(Arshdeep Singh) వంటివారు తమ ప్రియురాళ్లతో చెట్టాపట్టాలేసుకుని తిరుగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తరచూ వీరు గర్ల్‌ఫ్రెండ్‌తో ఉండడం నెట్టింట సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
కుర్రాళ్లన్నాక ప్రేమలో పడడం మామూలే. కానీ, కొందరు భారత ఆటగాళ్లు మాత్రం హద్దులు దాటుతున్నారు. మా లవర్ మా ఇష్టం అనుకుంటున్నారేమో.. గోప్యత పాటించడం మాత్రం మరిచిపోతున్నారు. స్టేడియంలోకి సరే.. కానీ, ఏకంగా టీమ్ హోట్లోనూ తమ ప్రియురాళ్లతో కనిపిస్తుండడంతో ‘ఇదేం ఐపీఎల్రా నాయనా.. ఆట చూడాలా.. వీళ్ల అతి చేష్టలు చూడాలా’ అని మండిపడుతున్నారు.
#WATCH | Guwahati, Assam: BCCI Secretary Devajit Saikia says, “This time, we have observed various anomalies and irregularities in the conduct of certain franchises and players. So BCCI and IPL are preparing an advisory, and we are going to release that advisory this evening… pic.twitter.com/JtScEpcpCg
— ANI (@ANI) May 7, 2026
మరీ ముఖ్యంగా పాండ్యా తన గర్ల్‌ఫ్రెండ్ మహీకా శర్మతో నానా రచ్చ చేస్తున్నాడు. మ్యాచ్ గెలిస్తే చాలు.. మైదానంలో అల్లేసుకుంటే ఛీ.. ఛీ.. ఇదేం తీరు అని చీవాట్లు తింటున్నాడు. అర్ష్‌దీప్, ఇషాన్,, యశస్వీ సైతం ఇష్టానుసారంగా తమ ప్రేయసితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఐపీఎల్ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న ఇలాంటి వారిపై బీసీసీఐ కఠిన చర్యలకు సిద్ధమైంది.

సెక్రటరీ దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. ‘పంతొమ్మిదో సీజన్లో ఆటగాళ్లు, ఫ్రాంచైజీలు కొన్ని అవకతవకలకు పాల్పడడం మా దృష్టికి వచ్చింది. కొందరు అనధికారింగా ఆటగాళ్లతో పాటు ఎక్కడికంటే అక్కడికి వస్తున్నారు. టీమ్ హోటల్.. క్రికెటర్ల అధికారిక గదుల్లోకి కూడా వెళ్తున్నారు. ఇలాంటివి బీసీసీఐ అవినీతి నిబంధనలకు వ్యతిరేకం. కొన్ని జట్ల యాజమానులు అయితే ఆటగాళ్లతో అనుమతిలేని చోట కూడా మాట్లాడుతున్నారు. తద్వారా కొన్ని నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.
ఈ విషయాన్ని మేము సీరియస్‌గా తీసుకున్నాం. ఇకపై ఆటగాళ్లు తమ ప్రేయసితో టీమ్ హోటల్లో కనిపించినా.. యాజమానులు ఎవరైనా ప్లేయర్లతో అనుమతించని చోట కనిపించినా బీసీసీఐ, ఐపీఎల్ ఆగ్రహానికి గురవుతారు. చర్యలు తప్పవు. ఇక నుంచి భద్రతా పరమైన చర్యల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం. చెకింగ్ పక్కాగా ఉండేలా చర్యలు చేపడుతాం’ అని సైకియా వెల్లడించాడు.
ఇషాన్, అదితి హుండియా

అర్ష్‌దీప్, సమ్రీన్ కౌర్

యశస్వీ, మ్యాడీ హమిల్టన్
