BCCI : మహిళల తొలి అండర్-19 టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టును బీసీసీఐ, లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సన్మానించనున్నారు. భారత్, న్యూజిలాండ్ మూడో టీ20 ఆడనున్న అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ప్రపంచ ఛాంపియన్లను సత్కరించున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. ‘భారతరత్న సచిన్ టెండూల్కర్, బీసీసీఐ అధికారులు ఫిబ్రవరి 1న సాయంత్రం 6ః30 గంటలకు అండర్-19 టీమ్‌ను సన్మానించనున్నారు. యంగ్ క్రికెటర్స్ భారత దేశం గర్వపడేలా చేశారు. వాళ్లు సాధించిన ఘనతకు గుర్తుగా వాళ్లను సత్కరించునున్నాం. ఈ విషయాన్ని తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని జై షా ట్వీట్ చేశాడు.
ఫైనల్లో ఇంగ్లండ్ చిత్తు
ఐసీసీ తొలిసారి నిర్వహించిన మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్‌ను భారత అమ్మాయిలు గెలుచుకున్నారు. షెఫాలీ వర్మ కెప్టెన్సీలోని భారత జట్టు ఫైనల్లో ఇంగ్లండ్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 68 రన్స్‌కే పరిమితమైంది. టైటస్ సాధు, అర్చనా దేవి, పర్షవి చోప్రా తలా రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బ కొట్టారు. స్వల్ప లక్ష్య ఛేదనలో ఇండియా మూడు వికెట్లు కోల్పోయింది. సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20లో టీమిండియా, కివీస్ మధ్య పోరు హోరాహోరీగా ఉండనుంది. ఆదివారం లక్నోలో జరిగిన కీలకమైన రెండో టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ సమం చేసింది.
It is with great delight I share that Bharat Ratna Shri @sachin_rt and @BCCI Office Bearers will felicitate the victorious India U19 team on Feb 1st in Narendra Modi Stadium at 6:30 PM IST. The young cricketers have made India proud and we will honour their achievements.
— Jay Shah (@JayShah) January 30, 2023