దుబాయ్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వైఫల్యం తర్వాత విదేశీ పర్యటనలకు ఆటగాళ్ల కుటుంబాలను వెంట తీసుకెళ్లే విషయంలో కఠిన నిబంధనలను తీసుకొచ్చిన బీసీసీఐ.. కాస్త వెనక్కి తగ్గింది. చాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్‌కు వెళ్లిన భారత జట్టు ఆటగాళ్లతో భాగస్వాములు, కుటుంబాలను వెంట తీసుకెళ్లేందుకు అనుమతినివ్వని బోర్డు.. ఒక మ్యాచ్ చూడటానికి కుటుంబాన్ని తీసుకొచ్చుకునేందుకు అనుమతినిచ్చింది.
అయితే ఇందుకు సదరు ఆటగాళ్లు.. తమ ఫ్యామిలీలు ఏ మ్యాచ్ చూడాలనుకుంటున్నారో బీసీసీఐకి ముందుగా సమాచారం అందించాలని బోర్డు ప్రతినిధి ఒకరు తెలిపారు.