ICC : భారత్‌లో టీ20 ప్రపంచకప్ ఆడేందుకు నిరాకరిస్తున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(BCB)కు షాకిచ్చేందుకు ఐసీసీ(ICC) సిద్ధమవుతోంది. ఇండియాలో ఆడకుంటే వేటు తప్పదని హెచ్చరించినా బెట్టు వీడని బంగ్లా బోర్డుకు బుద్ది వచ్చేలా స్కాట్లాండ్కు చోటివ్వాలని ఐసీసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ బోర్డు చిట్టచివరి ప్రయత్నానికి సిద్దమైంది. తమ జట్టుపై వేటును తప్పించుకునేందుకు శుక్రవారం ఐసీసీకి లేఖ రాసింది. వరల్డ్‌కప్ అభ్యంతరాలపై ఐసీసీ వివాదాల పరిష్కార కమిటీ ముందు తమ వాదనను వినిపించేందుకు అనుమతించాలని అత్యున్నత క్రికెట్ మండలిని కోరింది.
ఫిబ్రవరి7 నుంచి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ ఆడడంపై అనిశ్చితికి త్వరలోనే తెరపడనుంది. భద్రతా కారణాలను సాకుగా చూపి ఇండియాకు తమ జట్టును పంపబోమని బెట్టు చేస్తున్న బంగ్లా బోర్డుకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలనుకుంటోంది ఐసీసీ. ఇప్పటికిప్పుడు షెడ్యూల్ మార్పు కుదరని చెప్పినప్పటికీ బంగ్లాదేశ్ క్రికెట్ సభ్యులు పంతం వీడకపోవడమే అందుకు కారణం.
#CricketWithTOI | The #Bangladesh Cricket Board (BCB) has written another letter to the International Cricket Council (ICC), requesting that Bangladesh’s demand for a change of venue be referred to the ICC’s independent dispute resolution committee.
More details… pic.twitter.com/aGTDPv4g3x
— The Times Of India (@timesofindia) January 23, 2026
దాంతో, గ్రూప్ సీలోని బంగ్లాదేశ్‌ను తొలగించి.. ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్కు అవకాశమివ్వాలని ఐసీసీ అనుకుంటోంది. తమ జట్టుపై వేటు పడననుందని తెలిసిన బంగ్లా బోర్డు చివరి ప్రయత్నంగా ఐసీసీ వివాదాల పరిష్కార కమిటీని ఆశ్రయించనుంది. గ్రూప్ స్వాపింగ్‌కు అనుమతించకపోవడం, భారత్‌లో బంగ్లా జట్టు, సిబ్బంది భద్రతపై తమకున్న ఆందోళనలను ఈ కమిటీ దృష్టికి తేవాలని ఐసీసీకి లేఖ రాసింది.
🚨 SCOTLAND TO REPLACE BANGLADESH 🚨
– The ICC has rejected BCB’s request for a venue change. Scotland 🏴 likely to replace Bangladesh 😨
– All ICC members have voted to replace Bangladesh, if they don’t travel to India 🧐
– What’s your take 🤔 pic.twitter.com/XS7NYFMqac
— Richard Kettleborough (@RichKettle07) January 21, 2026
ఇప్పటికే ప్రపంచకప్ షెడ్యూల్లో మార్పులకు వ్యతిరేకంగా ఓటింగ్ చేపట్టింది ఐసీసీ. కాబట్టి బంగ్లా బోర్డు చివరి ప్రయత్నంలో కూడా విజయం సాధించడం కల్లే అంటున్నారు విశ్లేషకులు. అంతర్జాతీయ క్రికెట్లో తలెత్తే వివాదాలను ఐసీసీ డిస్ప్యూట్ కమిటీ పరిష్కరిస్తుంటుంది. బోర్డులు, ఆటగాళ్లు, అధికారులు విఫలమైనప్పుడు ఈ కమిటీ రంగంలోకి దిగుతోంది. అయితే.. ఐసీసీకి వ్యతిరేకంగా ఈ కమిటీ నిర్ణయం తీసుకున్న దాఖలాలు లేవు. దాంతో.. బంగ్లాదేశ్ మనసు మార్చుకుంటే తప్ప వేటు ఖాయం. అదే జరిగితే స్కాట్లాండ్ ప్రపంచకప్ ఆడడం పక్కా.