మకావు (చైనా): ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత స్టార్ ప్యాడ్లర్లు ఆకుల శ్రీజ, మనికా బాత్రా పోరాటం ముగిసింది. తొలి రౌండ్లో అలవోక విజయాలు సాధించిన ఈ ఇద్దరూ రెండో మ్యాచ్లో మాత్రం చేతులెత్తేయడంతో భారత్కు నిరాశే ఎదురైంది. గ్రూప్ స్టేజ్లో భాగంగా మహిళల సింగిల్స్ రెండో మ్యాచ్లో శ్రీజ 0-4తో రోమేనియాకు చెందిన ప్రపంచ 13వ ర్యాంకర్ బెర్నడెట్టె చేతిలో చిత్తుగా ఓడింది. మరో పోరులో మనికా 1-3తో బ్రున టకహాషి (బ్రెజిల్)కి తలవంచింది. మనికా, శ్రీజ ఓటములతో ఈ టోర్నీలో భారత పోరాటం కూడా ముగిసినైట్టెంది.