ఢిల్లీ : వరల్డ్ కప్‌లో భారత జట్టు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ లేకుండానే రెండో మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. అయితే.. గిల్ లేని లోటును పూడ్చడంలో ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషిస్తున్నాడని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ అన్నాడు. జట్టు అవసరార్థం టాపార్డర్ నుంచి మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఇషాన్ సొంతమని ప్రశంసలు కురిపించాడు. గతంలో ఇషాన్ ఓపెనర్‌గా ఆడిన అనుభవం ఉంది.
కాబట్టి ఆ విషయం గురించి ఇషాన్‌తో ప్రత్యేకంగా మట్లాడాల్సిన అవసరం లేదు. టాపార్డర్ నుంచి మిడిలార్డర్ వరకూ ఎక్కడైనా ఆడగల సమర్థుడు. అంతేకాదు ఇషాన్ మ్యాచ్ గమనాన్ని బాగా అర్థం చేసుకోగలడు. అతడు వరల్డ్ కప్ జట్టులో ఉండడానికి ప్రధాన కారణం అదే. రేపు అతను భారీ స్కోర్ చేయాలని కోరుకుంటున్నా అని విక్రమ్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇషాన్ నిరాశపరిచాడు. ఎదుర్కొన్న మొదటి బంతికే వికెట్ ఇచ్చేశాడు.