మెల్బోర్న్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో(Aus Vs Ind) భాగంగా జరగనున్న తుది రెండు టెస్టులకు సంబంధించిన జట్టును ఆస్ట్రేలియా ప్రకటించింది. 15 మంది సభ్యుల వివరాలను ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. సంచలన నిర్ణయం తీసుకున్నది. కొత్తగా ప్రకటించిన జట్టు సభ్యుల్లో 19 ఏళ్ల యువ బ్యాటర్ సామ్ కొంటాస్కు చోటు కల్పించింది. ఆ టీనేజ్ బ్యాటర్ ఆస్ట్రేలియా క్రికెట్లో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. సుమారు 70 ఏళ్ల తర్వాత టెస్టు క్రికెట్లో చోటు దక్కించుకున్న ఆస్ట్రేలియా ప్లేయర్‌గా కొంటాస్ రికార్డు సొంతం చేసుకున్నాడు. మెల్బోర్న్, సిడ్నీల్లో జరిగే టెస్టుల్లో అతను ఆడే అవకాశాలు ఉన్నాయి.
తొలి మూడు టెస్టులకు ఓపెనర్‌గా బరిలోకి దిగిన నాథన్ మెక్స్వీనేను జట్టు నుంచి తొలగించారు. అతను ఆరు ఇన్నింగ్స్‌లో కేవలం 72 రన్స్ మాత్రమే చేశాడు. దీంతో మెక్స్వీనేపై వేటు వేశారు. కొత్తగా ప్రకటించిన బృందంలో ఆల్‌రౌండర్ బ్యూ వెబ్‌స్టర్, పేస్ బౌలర్ సీన్ అబ్బాట్, జై రిచర్డ్సన్ కూడా ఉన్నారు. భారత్‌తో జరిగిన మూడు టెస్టుల నుంచి కేవలం మెక్స్వీనేను మాత్రమే ఆస్ట్రేలియా వదులుకున్నది. ఒకవేళ తుది జట్టుకు కొంటాస్ ఎంపిక అయితే, అప్పుడు ప్యాట్ కమ్మిన్స్ తర్వాత టెస్టు అరంగేట్రం చేసిన అతిపిన్న వయసున్న ఆసీస్ క్రికెటర్‌గా అతను రికార్డు క్రియేట్ చేయనున్నారు.
ఇటీవల ఆస్ట్రేలియా ప్రైమ్‌మినిస్టర్స్ లెవన్ జట్టుతో పాటు ఐసీసీ మెన్స్ అండర్ 19 క్రికెట్ వరల్డ్‌కప్‌లోనూ కొంటాస్ అత్యద్భుత ప్రదర్శన కనబరిచాడు. రై రిచర్డ్సన్, సీన్ అబ్బాట్లను కూడా 15 మంది బృందంలోకి తీసుకున్నారు.
JUST IN: Australia have added young gun Sam Konstas to a 15-player squad for the final two #AUSvIND Tests | @ARamseyCricket https://t.co/9P0hGCCqXw
— cricket.com.au (@cricketcomau) December 20, 2024