అబ్దుల్లాపూర్‌మెట్,ఆగష్టు 29 : మహబూబ్‌నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీలోని ప్రధాన సింథటిక్స్ అథ్లెటిక్స్ స్టేడియంలో జరిగే తెలంగాణ రాష్ట్రస్థాయి 11వ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీలకు తమ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని రంగారెడ్డి జిల్లా బాటసింగారం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్యాల యాదగిరి తెలిపారు.
14 ఏండ్ల బాలుర విభాగంలో 60 మీటర్ల పరుగుపందెం, లాంగ్ జంప్, షార్ట్‌పుట్ బ్యాక్త్రోకు ఎంపికైన మండరి ధనంజనేయులు 9వ తరగతి, 16 ఏండ్ల బాలుర విభాగంలో 60 మీటర్ల పరుగుపందెంలోఎంపికైన మూడవత్ శివాజిని శుక్రవారం పాఠశాల ఆవరణలో శుక్రవారం అభినందించి క్రీడా దుస్తులు అందజేశారు.