IND vs ENG 4th Test | పాటిదార్ డకౌట్.. గెలుపు వాకిట తడబడుతున్న టీమిండియా
IND vs ENG 4th Test : రాంచీ టెస్టులో గెలుపు దిశగా సాగుతున్న భారత జట్టు(Team India) ఒక్కసారిగా తడబడుతోంది. చూస్తుండగానే ముగ్గురు బ్యాటర్లు పెవిలియన్ చేరారు. ఇంగ్లండ్ యువ స్పిన్నర్లు టామ్ హర్ట్లే, షోయబ్ బషీర్ విజృంభణతో...
IND vs ENG 4th Test : రాంచీ టెస్టులో గెలుపు దిశగా సాగుతున్న భారత జట్టు(Team India) ఒక్కసారిగా తడబడుతోంది. చూస్తుండగానే ముగ్గురు బ్యాటర్లు పెవిలియన్ చేరారు. ఇంగ్లండ్ యువ స్పిన్నర్లు టామ్ హర్ట్లే, షోయబ్ బషీర్ విజృంభణతో 100 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. జో రూట్ బౌలింగ్‌లో యశస్వీ జైస్వాల్(37: 44 బంతుల్లో) ఔటైన కాసేపటికే రోహిత్ శర్మ(51 : 70 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్) స్టంపౌట్ అయ్యాడు. హర్ట్లే బౌలింగ్‌లో హిట్‌మ్యాన్ ఫ్రంట్‌ఫుట్‌లో డిఫెన్స్ ఆడబోయాడు.
కానీ, బంతి అందుకున్న ఫోక్స్ రెప్పపాటులో స్టంపౌట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన రజత్ పాటిదార్(0) బషీర్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. లెగ్ సైడ్‌లో కాచుకొని ఉన్న ఓలీపోప్ స్టన్నింగ్ క్యాచ్ పట్టడంతో పాటిదార్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్(15), రవీంద్ర జడేజా(2)లు ఆచితూచి ఆడుతున్నారు. భారత్ విజయానికి ఇంకా 78 పరుగులు కావాలి. అయితే.. ఇక్కడ సిరీస్ సమం చేసేందుకు ఇంగ్లండ్‌కు మరో 7 వికెట్లు అవసరం.
Game on! Bat-pad to leg slip and Bashir gets Patidar for a duck! #INDvENG
— ESPNcricinfo (@ESPNcricinfo) February 26, 2024
ఓవర్ నైట్ స్కోర్ 40తో నాలుగో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. రూట్ తన తొలి ఓవర్లోనే యశస్వీని ఔట్ చేశాడు. జైస్వాల్ ఆఫ్ సైడ్‌లో ఆడిన బంతిని అండర్సన్ డైవింగ్ క్యాచ్ పట్టాడు. దాంతో, 84 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ పడింది. ఆ కాసేపటికే హిట్‌మ్యాన్ టామ్ హర్ట్లే బౌలింగ్లోరెండు పరుగులు తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో 17వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
1⃣7⃣th Test fifty for Rohit Sharma 👌 👌
Talk about captain leading from the front 👍 👍
Follow the match ▶️ https://t.co/FUbQ3Mhpq9#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/PymznAtOLZ
— BCCI (@BCCI) February 26, 2024
అశ్విన్, కుల్దీప్ యాదవ్ తిప్పేయడంతో మూడో రోజు ఇంగ్లండ్‌ను 145 పరుగులకే కట్టడి చేసిన భారత్.. మ్యాచ్‌పై పట్టు బిగించింది. 192 పరుగుల ఛేదనలో ఓపెనర్లు యశస్వీ, రోహిత్ ధనాధన్ ఆడారు. దాంతో, మూడో రోజు ఆట ముగిసే సరికి భారత్ వికెట్ కోల్పోకుండా 40 రన్స్ కొట్టింది.
ఇవి కూడా చదవండి
- Texas | అమెరికాలో భారత సంతతి ఇంజినీర్‌కు టెక్సాస్ అత్యున్నత అకడమిక్ అవార్డు
- Albedo | నింగిలో భారీ నిఘా నేత్రం.. రోదసిలోకి శక్తివంతమైన ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్న ‘అల్బెడో’
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

