Shathira Jakir Jessy : క్రికెటర్‌గా దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆమె ఇప్పుడు విశ్వవేదికపై చరిత్ర సృష్టించనుంది. బ్యాటర్‌గా రాణించిన ఆమె త్వరలోనే అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించనుంది. ఆమె పేరు.. షథిరా జకీర్ జెస్సీ(Shathira Jakir Jessy). బంగ్లదేశ్ మాజీ క్రికెటర్ అయిన జెస్సీ వన్డే వరల్డ్ కప్ టోర్నీకి అంపైర్‌గా ఎంపికైంది. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా ఈవెంట్లో ఆమె తొలిసారి అంపైరింగ్ చేయనుంది. తద్వారా బంగ్లా నుంచి ప్రపంచ కప్‌లో ఈ బాధ్యతలు నిర్వర్తించిన మొదటి మహిళగా రికార్డు నెలకొల్పనుంది జెస్సీ.
‘ఈ అవకాశం కోసం నేను ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నా. ఎట్టకేలకు వరల్డ్ కప్ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేయాలనే నా కల నిజం కానుంది. టీ20 ప్రపంచ కప్‌లోనే అవకాశం వస్తుందనుకున్నా. కానీ, సాధ్యపడలేదు. దేవుడు నాకోసం గొప్ప ప్రణాళికలు వేశాడు. మెగా టోర్నీలో అంపైరింగ్ చేసేందుకు ఆతృతగా ఉన్నాను’ అని జెస్సీ భావోద్వేగంతో చెప్పింది. ఈమె కంటే ముందు బంగ్లాకు చెందిన షరిఫొద్దౌలా సైకత్ మాత్రమే (2023లో) వరల్డ్ కప్ మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించాడు.
Meet Shathira Jakir Jessy, Bangladesh’s 1st female umpire, breaking barriers with her dedication and skills. Her journey proves that success knows no gender, it’s about talent & hard work.
As part of #16DaysOfActivism, we feature her inspiring story. #NoExcuse pic.twitter.com/Se4CwFxYck— UNDP Bangladesh (@UNDP_BD) November 28, 2024
బంగ్లాదేశ్ తరఫున జెస్సీ కెరీర్ గొప్పగా సాగలేదు. కేవలం మూడంటే మూడు మ్యాచ్‌లే ఆడింది. రిటైర్మెంట్ తర్వాత అంపైరింగ్ మీద ఆసక్తితో 2022లో అర్హత సాధించింది. మలేషియా వేదికగా ఈమధ్యే జరిగిన అండర్ 19 ఆసియా కప్‌లో తొలిసారి విధులు నిర్వర్తించింది. అనంతరం పాకిస్థాన్‌లో ముగిసిన మహిళల వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లోనూ జెస్సీ అంపైరింగ్ చేసింది. అంతేకాదు స్వదేశంలో బంగ్లాదేశ్ ఎమర్జింగ్ టీమ్, దక్షిణాఫ్రికా సిరీస్‌లో కూడా అంపైరింగ్‌తో ఆకట్టుకుంది. సెప్టెంబర్ 30 నుంచి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీతో అంపైర్‌గా తన కెరీర్లో కొత్త అధ్యాయం మొదలవ్వనుంది.