BAN vs HKG : ఆసియా కప్ మూడో మ్యాచ్‌లో బంగ్లాదేశ్, హాంకాంగ్ తలపడుతున్నాయి. తొలి మ్యాచ్‌లో అఫ్గనిస్థాన్ చేతిలో చిత్తైన హాంకాంగ్‌కు ఇది రెండో మ్యాచ్ కాగా.. బంగ్లాకు ఇదే ఫస్ట్ గేమ్. అబూదాబీలోని షేక్ జయద్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన బంగ్లా సారథి లిటన్ దాస్(Litton Das) బౌలింగ్ ఎంచుకున్నాడు.
విజయంతో టోర్నీని ఆరంభించాలని ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడుతున్నామని లిటన్ తెలిపాడు. తొలి పోరులో కాబూలీలకు సరెండర్ అయిన హాంకాంగ్ ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటోంది. అఫ్గన్ చేతిలో 94 పరుగుల తేడాతో ఓడిన ఈ జట్టు.. ఈ మ్యాచ్‌లోనూ విఫలమైతే సూపర్ 4 దశకు చేరడం అసాధ్యమే.
It’s time for Match 3 🍿#AsiaCup LIVE 👉 https://t.co/MZwGt9xlh2 pic.twitter.com/odD1NiFj6P
— ESPNcricinfo (@ESPNcricinfo) September 11, 2025
బంగ్లాదేశ్ తుది జట్టు : పర్వేజ్ హొసేన్ ఎమాన్, తంజిద్ హసన్ తమీమ్, లిటన్ దాస్(కెప్టెన్, వికెట్ కీపర్), తౌహిద్ హ్రిదయ్, షమీమ్ హొసేన్, జకీర్ అలీ, మెహదీ హసన్, రిషద్ హొసేన్, తంజిమ్ హసన్ షకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్.
హాంకాంగ్ తుది జట్టు : జీషన్ అలీ(వికెట్ కీపర్), అన్షుమన్ రథ్, బాబర్ హయత్, నిజకత్ ఖాన్, కల్హన్ చల్లు, కించిత్ షా, యాస్మిన్ ముర్తాజా(కెప్టెన్), ఇజజ్ ఖాన్, ఎషాన్ ఖాన్, ఆయుశ్ శుక్లా, అతీక్ ఇక్బాల్.