BAN vs AFG : ఆసియా కప్‌లో గ్రూప్ బీలోని బంగ్లాదేశ్(Bangladesh), అఫ్గనిస్థాన్(Afghanistan) కీలక మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. తొలి మ్యాచ్‌లో విజయంతో జోరుమీదున్న ఇరుజట్లు అబుదాబీలో సూపర్ 4 బెర్తుకోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. షేక్ జయెద్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా సారథి లిటన్ దాస్ బౌలింగ్ తీసుకున్నాడు.
సంచలన విజయాలకు కేరాఫ్ అయిన అఫ్గన్‌కు చెక్ పెట్టేందుకు బంగ్లాదేశ్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడుతోంది. సీనియర్ పేసర్ తస్కిన్ అహ్మద్ రావడంతో ఆ జట్టు బౌలింగ్ బలం పెరిగింది. మరోవైపు రషీద్ ఖాన్ సారథ్యంలోని కాబూలీ టీమ్ ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. హాంకాంగ్‌పై 94 పరుగుల తేడాతో గెలుపొందిన అఫ్గనిస్థాన్.. ఆల్‌రౌండ్ షోతో బంగ్లా సూపర్ 4 ఆశలకు గండి కొట్టాలని భావిస్తోంది. భుజం గాయంతో బాధ పడుతున్న ఆ జట్టు ప్రధాన పేసర్ నవీన్ ఉల్ హక్ టోర్నీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.
4 swaps for Bangladesh, while Afghanistan stick to their winning combination. Who takes this one in Abu Dhabi? #AFGvBAN
Follow live ➡️ https://t.co/nXpVJKiTrG pic.twitter.com/qNi3rqGbgG
— ESPNcricinfo (@ESPNcricinfo) September 16, 2025
అఫ్గనిస్థాన్ తుది జట్టు : సెడిఖుల్లా అటల్, రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్). ఇబ్రహీం జద్రాన్, మొహమ్మద్ నబీ, గుల్బదిన్ నయీబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జన్నత్, రషీద్ ఖాన్(కెప్టెన్), నూర్ అహ్మద్, ఏం ఘజన్ఫర్, ఫజల్హక్ ఫారూఖీ.
బంగ్లాదేశ్ తుది జట్టు : తంజిద్ హసన్, సైఫ్ హసన్, లిటన్ దాస్(కెప్టెన్, వికెట్ కీపర్), తౌహిద్ హ్రిదయ్, జకీర్ అలీ, షమీమ్ హొసేన్, నసుమ్ అహ్మద్, నురుల్ హసన్, రిషద్ హొసేన్, ముస్తాఫిజుర్, తస్కిన్ అహ్మద్.