ఛటోగ్రామ్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా పట్టు బిగిస్తోంది. 307/2 ఓవర్ నైట్ స్కోరు వద్ద రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన సౌతాఫ్రికా.. అదే జోరును కొనసాగిస్తూ తొలి ఇన్నింగ్స్‌ను 575/6 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్ టోనీ డి జోర్జి (177) భారీ స్కోరు చేయగా మిడిలార్డర్లో మల్డర్ (105 నాటౌట్), సెనురన్ ముత్తుస్వామి (68 నాటౌట్) రాణించారు. బంగ్లా స్పిన్నర్ తైజుల్ ఇస్లాం (5/198) ఐదు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్.. 9 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది.
క్వార్టర్స్‌కు బోపన్న జోడీ
పారిస్: భారత వెటరన్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న, తన ఆస్ట్రేలియా సహచరుడు మాథ్యూ ఎబ్డెన్ కలిసి ఏటీపీ పారిస్ మాస్టర్స్‌లో క్వార్టర్స్‌కు ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌లో బోపన్న ద్వయం.. 6-4, 7-6 (7/5)తో మార్సెలో మెలో(బ్రెజిల్)-అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)ను ఓడించింది.
గచ్చిబౌలిలో మరో ఫుట్‌బాల్ మ్యాచ్
న్యూఢిల్లీ: కొద్దిరోజుల క్రితమే మూడు దేశాల (భారత్, సిరియా, మారిషస్) ఇంటర్ కాంటినెంటల్ కప్‌నకు ఆతిథ్యమిచ్చిన నగరంలోని గచ్చిబౌలి స్టేడియం మరో అంతర్జాతీయ మ్యాచ్‌కు సిద్ధమైంది. నవంబర్ 18న భారత్, మలేషియా మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్‌కు గచ్చిబౌలి ఆతిథ్యమివ్వనుంది.