ఎడిన్బర్గ్: బంగ్లాదేశ్‌పై వేటు కారణంగా టీ20 ప్రపంచకప్‌లో అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన స్కాట్లాండ్.. మంగళవారం మెగా టోర్నీ కోసం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. 2024 టీ20 ప్రపంచకప్‌లో ఆడిన పలువురు ప్రముఖ ఆటగాళ్లు, యువ క్రికెటర్లతో కూడిన జట్టుకు రిచి బెర్రింగ్టన్ సారథ్యం వహించనున్నాడు.
జట్టులో అఫ్ఘాన్ మూలాలున్న పేసర్ జైనుల్లా ఇహ్సాన్తో పాటు పాకిస్థాన్‌లో పుట్టి స్కాట్లాండ్కు ఆడుతున్న సఫ్యాన్ షరీఫ్‌కు చోటు దక్కింది. షరీఫ్ వీసా ప్రక్రియపై సందిగ్ధత కొనసాగుతుండగా అతడికి వీసా దక్కుతుందన్న ఆశాభావాన్ని స్కాట్లాం డ్ క్రికెట్ వ్యక్తం చేసింది.