NZ vs BAN : అంతర్జాతీయ క్రికెట్లో బంగ్లాదేశ్(Bangladesh) సంచలనాల పరంపర కొనసాగుతోంది. ఈ మధ్యే స్వదేశంలో న్యూజిలాండ్(Newzealand)పై తొలి టెస్టు విజయంతో చరిత్ర సృష్టించిన బంగ్లా.. తాజాగా మరో రికార్డు విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కివీస్ గడ్డపై జరిగిన మూడో వన్డేలో.. నజ్ముల్ హుసేన్ శాంటో(Najmul Hossain Shanto) నేతృత్వంలోని బంగ్లా 9 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.
న్యూజిలాండ్ గడ్డపై వన్డేల్లో బంగ్లాదేశ్‌కు ఇదే మొట్ట మొదటి గెలుపు కావడం విశేషం. అయితే.. తొలి రెండు వన్డేలో గెలుపొందిన కివీస్ 2-1తో సిరీస్ సొంతం చేసుకుంది. సిరీస్ ఆసాంతం అదరగొట్టిన విల్ యంగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.
A dominant win for Bangladesh sees them finish the three-match ODI series on a high 🙌#NZvBAN | https://t.co/LHjGAUb5Zo pic.twitter.com/XWg6f6SO23
— ICC (@ICC) December 23, 2023
నేపియర్‌లోని మెక్లీన్ పార్క్‌లో జరిగిన ఆఖరి వన్డేలో బంగ్లాదేశ్ బౌలర్లు రెచ్చిపోయారు. పేసర్ షోరిఫుల్ ఇస్లా, తంజిమ్ హసన్ షకీబ్, సౌమ్యా సర్కార్ మూడేసి వికెట్లు తీయడంతో కివీస్ 98 పరుగులకే కుప్పకూలింది. బ్లాక్‌క్యాప్స్ జట్టులో ఓపెనర్ విల్ యంగ్ 28 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ వికెట్ నష్టపోయి అలవోకగా ఛేదించింది. కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో(51), ఓపెనర్ అనాముల్ హక్(37) ధనాదన్ ఆడి 15.1 ఓవర్లలోనే మ్యాచ్ ముగించారు.