BAN vs PAK : ఆసియా కప్‌లో ఫైనల్ బెర్తు కోసం బంగ్లాదేశ్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. సూపర్ 4లో చెరొక విజయంతో ఫైనల్ రేసులో నిలిచిన రెండుజట్లకు ఇది చావోరేవో మ్యాచ్. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌కూ లిటన్ దాస్ దూరమయ్యాడు. దాంతో.. బంగ్లా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జకీర్ అలీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు.
భారత జట్టు చేతిలో చిత్తుగా ఓడిన బంగ్లా ఎలాగైనా పాక్‌కు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో మూడు మార్పులతో ఆడుతోంది. సైఫుద్దీన్, నసుమ్, తమీమ్ బదులు.. నురుల్, తస్కిన్, మెహిదీ జట్టులోకి వచ్చారు. శ్రీలంకపై ఐదు వికెట్ల విజయంతో జోరు మీదున్న పాక్ మాత్రం అదే జట్టుతో బరిలోకి దిగుతోంది.
No Litton Das for Bangladesh still, while Pakistan field the same XI 🏏#PAKvBAN live ▶️ https://t.co/sBfTGWerP0 pic.twitter.com/NJhRhEbzNm
— ESPNcricinfo (@ESPNcricinfo) September 25, 2025
పాకిస్థాన్ తుది జట్టు : షహిబ్జద ఫర్హాన్, ఫఖర్ జమాన్, సయీం ఆయూబ్, సల్మాన్ అఘా(కెప్టెన్), హుసేన్ తలాట్, మహమ్మద్ హ్యారిస్(వికెట్ కీపర్), మొహమ్మద్ నవాజ్, ఫహీం అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హ్యారిస్ రవుఫ్, అబ్రార్ అహ్మద్.
బంగ్లాదేశ్ తుది జట్టు : సైఫ్ హొసేన్, పర్వేజ్ హొసేన్, తౌహిద్ హ్రిదోయ్, షమీమ్ హొసేన్, జకీర్ అలీ(కెప్టెన్, వికెట్ కీపర్), నురుల్ హసన్, మహెది హసన్, రిషద్ హొసేన్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్, ముస్తాఫిజుర్.