BAN vs NED : క్రికెట్ ఆట ఎంత సరదగా అనిపిస్తుందో.. అప్పుడప్పుడు అంతే ప్రమాదకరం కూడా. బంతి తలకు తగిలి డగౌట్‌కు వెళ్లిన క్రికెటర్లు.. మైదానంలోనే కుప్పకూలిన ఫిలిప్ హ్యూస్ (Philip Hughes) లాంటి వాళ్లను చూశాం. తాజాగా టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ (Bangladesh) క్రికెటర్‌కు అచ్చం అలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే.. ఓపెన్ తంజిమ్ హసన్ (Tanzid Hasan) అదృష్టం కొద్దీ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
అసలేం జరిగిందంటే.. ? గురువారం ఉదయం గ్రూప్ డిలో ఉన్న నెదర్లాండ్స్(Netherlands), బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నెదర్లాండ్స్ పేసర్ వివియన్ కింగ్మా(Vivian Kingma) బౌలింగ్‌లో బంగ్లా ఓపెన్ తంజిమ్‌కు విచిత్ర పరిస్థితి ఎదురైంది.
డచ్ బౌలర్ సంధించిన బౌన్సర్ ఆడే ప్రయత్నంలో బంతి ఏకంగా అతడి హెల్మెట్‌లో ఇరుక్కుపోయింది. దాంతో, అతడు ఒక్క క్షణం షాక్‌కు గురయ్యాడు. కొంచెం సేపటికి తేరుకొని హెల్మెట్ తీసి పట్టీల మధ్య ఇరుక్కున్న బంతిని తొలగించాడు. రీప్లేలో ఇదంతా గమనించిన ఫిజియో పరుగెత్తుకొని మైదానంలోకి వచ్చి కంకషన్ టెస్టు(Concussion Test) చేశాడు. అయితే.. తంజిమ్ తలకు చిన్నపాటి గాయం కూడా కాకపోవడంతో బంగ్లా శిబిరం ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకుంది. అనంతరం తంజిమ్ 35 పరుగుల వద్ద ఔటయ్యాడు.
It’s a win for 🇧🇩 in St. Vincent 🙌
Rishad Hossain’s match-defining spell of 3/33 guides Bangladesh to a crucial victory against the Netherlands 👏#T20WorldCup | #BANvNED | 📝: https://t.co/ffM1JytbGS pic.twitter.com/lXWJvJEqXj
— ICC (@ICC) June 13, 2024
బంగ్లాదేశ్ నిర్దేశించిన 160 పరుగుల ఛేదనలో నెదర్లాండ్స్ చేజేతులా ఓడింది. ఒకదశలో 69-3తో పటిష్ట స్థితిలో కనిపించిన ఎడ్వర్డ్స్ బృందం.. టపాటపా వికెట్లు కోల్పోయి 138 రన్స్ కొట్టిందంతే. దాంతో, 25 పరుగుల తేడాతో గెలుపొందిన బంగ్లాదేశ్ సూపర్ 8 బెర్తుకు మరింత చేరువైంది. బంగ్లా ముందడుగు వేయడంతో ఇదే గ్రూప్‌లో ఉన్న మాజీ చాంపియన్ శ్రీలంక టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది.