చెన్నై: భారత బౌలర్లు చెలరేగిపోతున్నారు. బంగ్లాదేశ్(Ind Vs Ban)తో జరుగుతున్న తొలి టెస్టులో.. రెచ్చిపోయారు. బంగ్లా టాప్ ఆర్డర్‌ను ఈజీగా పెవిలియన్‌కు పంపించేశారు. బుమ్రా, ఆకాశ్, జడేజా, సిరాజ్‌లు వరుసగా వికెట్ల తీశారు. దీంతో బంగ్లా తన తొలి ఇన్నింగ్స్‌లో.. 37 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 112 రన్స్ మాత్రమే చేసింది. రెండో రోజు బంగ్లా బ్యాటర్లలో షకీబ్, లింటన్ దాస్‌లు కాస్త పోరాడారు. ఆ ఇద్దరి మధ్య 50 రన్స్ భాగస్వామ్యం ఏర్పడింది. అయితే కొంత డేరింగ్ షాట్లకు వెళ్లిన లింటన్ తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. ప్రస్తుతం 264 పరుగులు వెనుకబడి ఉంది బంగ్లాదేశ్. రెండో రోజు ఆటలో ఇంకా మూడవ సెషన్ మిగిలి ఉన్నది. భారత తన తొలి ఇన్నింగ్స్‌లో 376 రన్స్ కు ఆలౌటైంది.
That’ll be Tea on Day 2 of the 1st Test.
Bangladesh 112/8, trail #TeamIndia by 264 runs.
Scorecard – https://t.co/jV4wK7BgV2……… #INDvBAN @IDFCFIRSTBank pic.twitter.com/D23dS3I3Y4
— BCCI (@BCCI) September 20, 2024