కాన్పూర్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు(Ind Vs Ban)లో టీమిండియా గెలుపు దాదాపు ఖాయమైంది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ఇవాళ 146 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆ జట్టు 94 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. భోజన విరామ సమయాన్ని ఇవాళ అరగంట పొడిగించారు. బంగ్లా బ్యాటర్ ముషిఫికర్ 67 బంతుల్లో 37 రన్స్ చేశాడు. అయిదు రోజుల టెస్టు మ్యాచ్‌లో రెండున్నర రోజులు వర్షం వల్ల కొట్టుకుపోయాయి. కానీ సోమవారం రోజున భారత్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది.
బంగ్లాను తొలి ఇన్నింగ్స్‌లో 233 రన్స్‌కు ఔట్ చేసిన తర్వాత వేగంగా స్కోర్ చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇండియా 285 రన్స్ చేసి డిక్లేర్ చేసింది. ఇక భారత బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా బ్యాటర్లను ముప్పుతిప్పలుపెట్టారు. బుమ్రా, జడేజా, అశ్విన్‌లు చెరి మూడేసి వికెట్లు తీసుకున్నారు. లంచ్ బ్రేక్ తర్వాత ఇండియా 95 రన్స్ టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్ ఆడనున్నది.
Middle stump out of the ground! 🎯
An absolute Jaffa from Jasprit Bumrah to wrap the 2nd innings 🔥
Bangladesh are all out for 146
Scorecard – https://t.co/JBVX2gyyPf#TeamIndia | #INDvBAN | @Jaspritbumrah93 | @IDFCFIRSTBank pic.twitter.com/TwdJOsjR4g
— BCCI (@BCCI) October 1, 2024