ICC – BCB : భారత్‌లో టీ20 ప్రపంచకప్ ఆడేందుకు అభ్యంతరం చెబుతున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (Bangladesh Cricket Board) బెట్టు వీడడం లేదు. ఇదివరకే షెడ్యూల్ ప్రకటించినందున నిర్ణయాన్ని మార్చుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) సూచించినా ఆ దేశ బోర్డు సభ్యులు వినట్లేదు. దాంతో.. నేరుగా చర్చలు జరిపేందుకు ఇద్దరు సీనియర్ అధికారులు శనివారం ఢాకా చేరుకున్నారు. కానీ, బీసీబీ మాత్రం భారత్‌లో ఆడమని భీష్మించుకుంది. అయితే.. ఇండియాలో ఆడకుండా తమ జట్టును గ్రూప్ నుంచి వేరొక గ్రూప్‌లోకి మార్చాలని ఐసీసీకి బీసీబీ విజ్ఞప్తి చేసింది.
క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. శనివారం ఐసీసీ ప్రతినిధులు ఢాకాలో బంగ్లాదేశ్ బోర్డు సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్‌లో ఆడకూడదనే నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని ఐసీసీ బృందం నచ్చజెప్పాలని చూసింది. కానీ, బంగ్లా బోర్డు మెంబర్స్ మాత్రం అందుకు అంగీకరించలేదు. శ్రీలంకలో ఆడేందుకు వీలు కల్పించేలా తమ జట్టును గ్రూప్ సీ నుంచి గ్రూప్ బీలోకి మార్చాలని ఐసీసీ సభ్యలను వారు కోరారు.
🚨BCB has urged the ICC to change their group so that they can play all their league games at the T20 World Cup in Sri Lanka
Cricbuzz understands Bangladesh want to swap groups with Ireland pic.twitter.com/yWt4QbBgVl
— Cricbuzz (@cricbuzz) January 17, 2026
‘ఐసీసీ బృందంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సమావేశం అర్ధవంతంగా జరిగింది. ఈ సందర్భంగా ఇదివరకూ చెప్పినట్టే.. భారత్‌లో ప్రపంచకప్ ఆడబోమని చెప్పాం. బంగ్లాదేశ్ జట్టు మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీ ప్రతినిధులను కోరాం. ఈ సమావేశంలో భారత్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు, అభిమానులు, సిబ్బంది, మీడియా, స్పాన్సర్ల భద్రత గురించి మా ప్రభుత్వానికి ఉన్న భయాలు, ఆందోళనను వారికి వివరించాం. ఈ క్రమంలోనే గ్రూప్ సీలో ఉన్న బంగ్లాను ఐర్లాండ్ స్థానంలో గ్రూప్ బీకి మార్చాలని విజ్ఞప్తి చేశాం’ అని బీసీబీ ఒక ప్రకటనతో పేర్కొంది.
SAVE THE DATES! 😍
The ICC Men’s #T20WorldCup 2026 schedule is out! 📝
Which match are you most excited for? 👇 pic.twitter.com/ziVrO8RiXj
— Star Sports (@StarSportsIndia) November 25, 2025
పొట్టి ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం ప్రస్తుతం గ్రూప్ ‘సీ’లో ఉన్న బంగ్లాదేశ్ లీగ్ దశలో మూడు మ్యాచ్‌లు కోల్‌కతాలో ఆడాల్సి ఉంది. నాలుగో మ్యాచ్ ముంబైలో ఉంది. ఇక గ్రూప్ ‘బీ’లోని ఐర్లాండ్ కొలంబోలో గ్రూప్ దశ మ్యాచ్‌లు ఆడనుంది. దాంతో.. ఇరుజట్ల గ్రూప్‌ను మార్చడం వల్ల బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకలోనే వరల్డ్‌కప్ ఆడేందుకు అవకాశముంటుంది. బంగ్లా బోర్డు ప్రతిపాదనపై అటు ఐసీసీ, ఇటు ఐర్లాండ్ క్రికెట్‌తో పాటు ఆతిథ్య దేశాల బోర్డులైన బీసీసీఐ, శ్రీలంక క్రికెట్ ఎలా స్పందిస్తాయో చూడాలి.