దోహ: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో భారత ‘ఏ’ తడబాటుకు గురై సెమీస్‌లోనే నిష్క్రమించింది. శుక్రవారం బంగ్లాదేశ్”ఏ’తో హోరాహోరీగా సాగిన హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో బంగ్లా జట్టు సూపర్ ఓవర్లో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా ‘ఏ’.. హబీబుర్ రెహ్మన్ (65), మెహెరొబ్ (48*) ధాటిగా ఆడటంతో 20 ఓవర్లకు 194/6 పరుగుల భారీ స్కోరు చేసింది.
భారత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. ఛేదనలో ప్రియాన్ష్ (44), వైభవ్ (38), జితేశ్ (33), వధేరా (32*) ధాటిగా ఆడటంతో నిర్ణీత ఓవర్లకు భారత్ కూడా 194 రన్స్ చేయడంతో మ్యాచ్ టై అయింది. ఇక సూపర్ ఓవర్లో జితేశ్, అశుతోష్ డకౌట్లు అవడంతో భారత ఓటమి ఖరారైంది.