అహ్మదాబాద్: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ఆవేశ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ ఆఖరి బంతికి విరాట్ కోహ్లీ(12) బౌల్డ్ కాగా, ఇషాంత్ శర్మ వేసిన తర్వాతి ఓవర్ మొదటి బంతికే దేవదత్ పడిక్కల్(17) కూడా బౌల్డ్ అయ్యాడు. సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఇషాంత్ బుల్లెట్ లాంటి బంతులతో బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. ఐదో ఓవర్లో కనీసం ఒక్క పరుగూ ఇవ్వలేదు. పవర్‌ప్లేలో ఆధిపత్యం ప్రదర్శించిన ఢిల్లీ బౌలర్లు బెంగళూరును 36/2తో కష్టాల్లో పడేశారు.8 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 2 వికెట్లకు 57 పరుగులు చేసింది. మాక్స్వెల్(23), రజత్ పటిదార్(4) క్రీజులో ఉన్నారు.
Double blow! #RCB lose their openers
— IndianPremierLeague (@IPL) April 27, 2021
Avesh Khan first gets the big wicket of King Kohli and @ImIshant then strikes from the other end and removes Padikkal. After 5 overs, #RCB are 30-2.https://t.co/NQ9SSSBbVT #DCvRCB #VIVOIPL pic.twitter.com/FKCCF7PhcU