చటోగ్రామ్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలిటెస్టులో టీమ్ఇండియా పట్టుభిగించింది. భారత బౌలర్లు విజృంభిచడంతో బంగ్లా బ్యాట్స్‌మెన్ 150 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 254 పరుగుల ఆధిక్యం లభించింది. అంతకు ముందు బ్యాటర్లు కనబర్చిన అద్భుత పోరాటంతో టీమ్ఇండియా 404 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో బ్యాంటిగుకు దిగిన బంగ్లా ఆటగాళ్లను భారత బౌలర్లు ఏ దశలోనూ నిలదొక్కుకోలేకపోయారు. దీంతో 133 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది.
133/ 8 ఓవర్‌నైట్ స్కోర్‌తో శుక్రవారం ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ మరో 17 పరుగులు మాత్రమే జోడించి 150 రన్స్‌కు ఆలౌట్ అయ్యారు. భారత బౌలర్లలో సిరాజ్ 3, కుల్దీప్ యాదవ్ 5, ఉమేశ్ యాదవ్, అక్షర్ పటేల్ ఒకటి చొప్పున వికెట్లు పడగొట్టారు.
#INDvBAN 1st Test, day 3 | Bangladesh all-out on 150 against India, trail by 254 runs.
— ANI (@ANI) December 16, 2022