టోక్యో: రెజ్లింగ్‌లో మెడల్ ఫెవరేట్ బజరంగ్ పూనియా తన మ్యాచ్‌లో నెగ్గాడు. టోక్యో ఒలింపిక్స్ 65 కిలోల ఫ్రీ స్టయిల్ మ్యాచ్‌లో ఇవాళ బజరంగ్ పూనియా.. కిర్గిస్తాన్‌కు చెందిన బలమైన ప్రత్యర్థి ఎర్నజర్ అక్మతలేవ్‌పై విజయం సాధించాడు. రసవత్తరంగా సాగిన బౌట్లో పూనియా పాయింట్ల ఆధారంగా గెలుపొందాడు. నిజానికి ఇద్దరూ 3-3 స్కోర్ చేసినా.. తొలి పీరియడ్‌లో టేక్‌డౌన్ వల్ల బజరంగ్‌కు విజయం దక్కింది. ఫస్ట్ పీరియడ్‌లో బజరంగ్ పూనియా మూడు పాయింట్లు సాధించాడు. అయితే కిర్గిస్తాన్ ప్లేయర్ ఫస్ట్ క్వార్టర్లో ఒక పాయింట్, సెకండ్ పీరియడ్‌లో రెండు పాయింట్లు సాధించి సమంగా నిలిచాడు. కానీ విక్టరీ బై పాయింట్స్ ఆధారంగా .. బజరంగ్ పూనియాను విజేతగా ప్రకటించారు. క్వార్టర్స్‌లో ఇరాన్‌కు చెందిన ఘైసి చెకా మోర్టాజాతో బజరంగ్ పోరాడనున్నారు.