సిడ్నీ: ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో వీరోచిత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న నాలుగవ టెస్టులో.. బెయిర్‌స్టో 103 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. బెయిర్‌స్టో ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ ఏడు వికెట్లు కోల్పోయి 258 రన్స్ చేసింది. 36 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజ్‌లోకి వచ్చిన బెయిర్‌స్టో అద్భుత స్పూర్తిని ప్రదర్శించాడు. అయిదో వికెట్‌కు బెన్ స్టోక్స్, బెయిర్‌స్టోలు 128 రన్స్ జోడించారు. 66 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టోక్స్ ఔటవ్వగా.. ఆ తర్వాత మార్క్ వుడ్‌తో కలిసి బెయిర్‌స్టో 72 రన్స్ జోడించారు. ఆస్ట్రేలియా బౌలర్ స్కాట్ బోలాండ్ 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. ఇంకా ఇంగ్లండ్ 158 పరుగులు వెనుకబడి ఉంది.