ECB : యాషెస్ సిరీస్ సమీపిస్తున్న వేళ ఆటగాళ్లలో ఉత్సాహం నింపింది ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB). జాతీయ జట్టు విజయాల్లో కీలకం అవుతున్న క్రికెటర్లకు బోర్డు మంగళవారం సెంట్రల్ కాంట్రాక్ట్ (Central Contracts)లు ప్రకటించింది. సీనియర్లకు పెద్ద పీట వేసిన ఈసీబీ ఈ మధ్య అంతర్జాతీయంగా సత్తా చాటిన యువకెరటాలకు కూడా కాంట్రాక్ట్‌లో చోటు కల్పించింది. టెస్టు సారథి బెన్ స్టోక్స్‌తో పాటు మూడు ఫార్మాట్లలో కీలకమైన ఆటగాళ్లలో పలువురికి రెండేళ్ల క్రాంట్టాక్ లభించింది.
ఈ ఏడాది అక్టోబర్ నుంచి 2026 సెప్టెంబర్ వరకూ ఇంగ్లండ్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ఇచ్చింది. షాకింగ్ న్యూస్ ఏంటంటే.. పవర్ హిట్టర్లు అయిన జానీ బెయిర్‌స్టో (Jonny Bairstow), లియాం లివింగ్‌స్టోన్‌లు మాత్రం ఈ జాబితాలో లేరు. నిరుడు భారత పర్యటనలో రానించిన స్పిన్నర్ జాక్ లీచ్, పేసర్ ఓలీ స్టోన్లకు కూడా కాంట్రాక్ట్‌లో చుక్కెదురైంది. పేసర్ మార్క్ వుడ్‌తో పాటు జూనియర్లకు ఏడాది కాలానికే కాంట్రాక్ట్ ఇస్తున్నట్టు ఈసీబీ వెల్లడించింది.
The ECB has announced the England men’s central contract list for 2025-26 🏴 pic.twitter.com/P2YoF5Dbtq
— ESPNcricinfo (@ESPNcricinfo) November 4, 2025
ఇటీవల ‘ది హండ్రెడ్ లీగ్’లో మెరిసిన యువ పేసర్ సోనీ బేకర్(Sonny Baker)కు ప్రోత్సాహకంగా తొలిసారి కాంట్రాక్ట్ ఇచ్చారు. స్పిన్ ఆల్‌రౌండర్ డాసన్, సాకిబ్ మహమూమద్, పొడగరి పేసర్ జేమీ ఓవర్టన్‌లకు కూడా మొదటిసారి ఈసీబీ నుంచి జీతం అందుకోనున్నారు.
రెండేళ్ల కాంట్రాక్ట్ : బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్, బ్రైడన్ కార్సే, సామ్ కరన్, బెన్ డకెట్ విల్ జాక్స్, ఆదిల్ రషీద్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్.
ఏడాది కాంట్రాక్ట్ : రెహ్మాన్ అహ్మద్, సోనీ బేకర్, షోయబ్ బషీర్, జాక్ క్రాలే, లియాం డాసన్, సకీబ్ మహమూద్, జేమీ ఓవర్టన్, ఓలీ పోప్, మాథ్యూ పాట్స్, ఓలీ పోప్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్, ల్యూక్ వుడ్.
వీళ్లపై వేటు : జానీ బెయిర్‌స్టో, జాక్ లీచ్, లివింగ్‌స్టోన్, రీసే టాప్లే, జాన్ టర్నర్.
డెవలప్మెంట్ కాంట్రాక్ట్ : జోష్ హల్, ఎడ్డీ జాక్, టామ్ లావెస్, మిచెల్ స్టాన్లీ.