సిడ్నీ: ఇది మీరు నమ్మలేరు. వేగంగా వచ్చిన బంతి.. వికెట్లకు తగిలినా.. బెయిల్స్ ఏమాత్రం కదలలేదు. అంతే కాదు.. వికెట్లను తగిలాక బంతి ఓ పక్కకు వెళ్లింది. ఈ ఘటన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌లో చోటుచేసుకున్నది. ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. బౌలర్ కెమరూన్ గ్రీన్ వేసిన ఫుల్ లెన్త్ బంతి వికెట్లకు తగిలింది. కానీ ఇక్కడో గమ్మత్తు జరిగింది. ఆ బంతిని వాస్తవానికి బెన్ స్టోక్స్ వదిలేశాడు. అయితే వికెట్లకు తగిలిన బంతి పక్కకు వెళ్లడంతో.. ఆన్‌ఫీల్డ్ అంపైర్ దాన్ని ఎల్బీడబ్ల్యూగా ఔట్ ఇచ్చేశాడు. ఇక బ్యాటర్ స్టోక్స్ అంపైర్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ రివ్యూకు వెళ్లాడు. ఆ రిప్లేలో మరో నిజం తెలిసింది. అసలు బ్యాటర్ దగ్గర నుంచి బంతి వెళ్లనేలేదు. కానీ ఆఫ్ స్టంప్ వికెట్లను తాకుతూ బాల్ చాలా డీవియేట్ అయ్యింది. ఇంకా గమ్మత్తు ఏంటంటే.. స్పీడ్‌గా వస్తున్న బాల్ తగిలినా.. వికెట్లపైన ఉండే బెయిల్స్ కదలలేదు. దీంతో బౌలర్ గ్రీన్ ఖంగుతిన్నాడు. ఇక బ్యాటర్ స్టోక్స్ టీవీ రిప్లేలు చూసి తెగ నవ్వుకున్నాడు. ఆస్ట్రేలియన్ల అందరూ ఆ ఘటనతో స్టన్ అయ్యారు. సిడ్నీ టెస్టు రెండవ రోజు ఆటలో ఈ సంఘటన జరిగింది. ఆ వీడియో చూడండి.
UNBELIEVABLE #Ashes pic.twitter.com/yBhF8xspg1
— cricket.com.au (@cricketcomau) January 7, 2022