satwik sairaj | దుబాయ్: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడి నయా చరిత్ర లిఖించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత జోడి తొలి గేమ్‌ను గెలుచుకుని రెండో గేమ్‌లో 13-14తో వెనుకంజలో ఉన్న సమయంలో ప్రత్యర్థి చైనీస్ తైపీ జోడి లీ యాంగ్-వాంగ్ చి లిన్ ఆట నుంచి తప్పుకోవడంతో మనవాళ్లు తుదిపోరుకు చేరారు. గత 52 ఏళ్లలో ఈ టోర్నీలో భారత్‌కు పురుషుల డబుల్స్‌లో తొలి పతకం లభించనున్నది.