నింగ్బొ (చైనా) : బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్స్‌లో భారత టైటిల్ ఆశలు మోస్తున్న మిక్స్డ్ డబుల్స్ ద్వయం ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ పోరులో కపిల-క్రాస్టో జోడీ 20-22, 13-21తో ఐదో సీడ్ టాంగ్ చున్ మన్ – సె యింగ్ సుయెట్ (హాంకాంగ్) చేతిలో పరాజయం పాలైంది. తొలి గేమ్‌లో పోరాడి ఓడిన భారత జంట.. రెండో గేమ్‌లో చేతులెత్తేసి మ్యాచ్‌ను చేజార్చుకుంది.