కరాచీ : వన్డేలలో అత్యంత వేగంగా 6వేల పరుగులు పూర్తిచేసిన క్రికెటర్లలో పాకిస్థాన్ మాజీ సారథి బాబర్ ఆజమ్.. భారత దిగ్గజం విరాట్ కోహ్లీని అధిగమించాడు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఈ ఘనతను అందుకున్నాడు. బాబర్‌కు వన్డేలలో ఇది 123వ ఇన్నింగ్స్. కోహ్లీ 136 ఇన్నింగ్స్‌లలో ఈ రికార్డు సాధించాడు. అంతర్జాతీయ స్థాయిలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లా (123 ఇన్నింగ్స్)తో సమానంగా బాబర్ నిలిచాడు.