PAK vs SL : రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ బ్యాటర్లు తేలిపోయారు. తొలి టెస్టు ఓటమి నుంచి పాఠాలు నేర్వకుండా మూకుమ్మడిగా చేతులెత్తేశారు. రావల్పిండిలో ఓపెనర్ సయూం అయూబ్(58), కెప్టెన్ షాన్ మసూద్(57)లు మంచి పునాది వేసినా.. బంగ్లాదేశ్ స్పిన్నర్ల ధాటికి మిగతా వాళ్లు డగౌట్ బాట పట్టారు. ఆఖర్లో అఘా సల్మాన్(54) అర్థ శతకంతో పోరాడి పాక్ పరువు కాపాడాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పాక్‌ను ముంచిన యువ స్పిన్నర్ మెహిదీ హసన్ మిరాజ్(5/61) మళ్లీ విజృంభించడంతో పాక్ 274 పరుగులకే ఆటౌటయ్యింది.
తొలి రోజు వర్షార్పణం కావడంతో రెండో రోజు టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ తీసుకుంది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే పాక్‌కు పెద్ద షాక్. ఓపెనర్ షఫీక్ అబ్దుల్లా(0)ను తస్కిన్ అహ్మద్ డకౌట్‌గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత సయూం అయూబ్(58) జతగా సారథి షాన్ మసూద్(57) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. వీళ్లిద్దరూ బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొని అర్ధ శతకాలతో చెలరేగారు. రెండో వికెట్‌కు 107 పరుగులు జోడించి పాక్‌ను పటిష్ఠ స్థితిలో నిలిపారు.
☝️ Saim Ayub
☝️ Shan Masood
☝️ Khurram Shahzad
☝️ Mohammad Ali
☝️ Abrar AhmedA 10th fifer in Tests for Mehidy 👏 https://t.co/J5rmlAEWUY | #PAKvBAN pic.twitter.com/US3l4DZlUN
— ESPNcricinfo (@ESPNcricinfo) August 31, 2024
ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని మెహిదీ హసన్ మిరాజ్ విడదీశాడు. మొదట మసూద్‌ను ఎల్బీగా దొరకబుచ్చుకొని.. ఆ కాసేపటికే ఆయూబ్‌ను సైతం పెవలియన్ పంపాడు. అక్కడితో పాక్ పతనం మొదలైంది. బాబర్ ఆజాం(31), సాద్ షకీల్(16), మహ్మద్ రిజ్వాన్(29)లు విఫలమవ్వగా.. అఘా సల్మాన్(54) అద్భుత పోరాటంతో జట్టు స్కోర్ 250 దాటించాడు.