Nivetha Thomas | మలయాళ సినీ పరిశ్రమలో జస్టిస్ హేమా కమిటీ ప్రకంపనలు సృష్టించింది. కమిటీ నివేదిక అనంతరం పలువురు నటీమణులు బయటకు వచ్చి తాము వేధింపుల ఎదుర్కొన్నామని వెల్లడించారు. ఈ క్రమంలో పలువురు నటులపై కేసులు సైతం నమోదయ్యాయి. ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై పలువురు సీనియర్ హీరోయిన్లు సైతం స్పందించారు. తాజాగా ప్రముఖ నటి నివేతా థామస్ సైతం తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నివేదా ప్రస్తుతం తెలుగులో ‘35 చిన్న కథకాదు’ మూవీలో నటిస్తున్నది. ఈ మూవీలో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటిస్తున్నది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నది. ఇందులో భాగంగా మీడియాతో ముచ్చటించింది. తల్లి పాత్ర పోషించడంతో కెరీర్‌పై ఏమైనా ప్రభావం చూపుతుందా? అని ప్రశ్నించగా.. విభిన్న పాత్రల్లో నటించాలని ఉందని తెలిపింది. అన్ని రకాల పాత్రలను తాను అన్వేషించాలనుకుంటున్నానని.. తన రాబోయే మరో చిత్రంలో మధ్య వయస్కురాలి పాత్రలాంటిది ఏదైనా ఎంచుకోవచ్చని పేర్కొంది.
ఈ క్రమంలోనే మలయాళం సినీ ఇండస్ట్రీలో వేధింపులు, జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్‌పై ప్రశ్న ఎదురైంది. దీనికి నివేదా స్పందిస్తూ.. మలయాళ పరిశ్రమకు ఇదో చేదు అనుభవమని.. ప్రస్తుతం జరిగే పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు బాధాకరమని.. ప్రస్తుతం అమ్మా (మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)లో సభ్యురాలిగా ఉన్నానని చెప్పారు. హేమ కమిటీలో వెల్లడించిన అంశాలు బాధాకరమని.. నివేదికలోని అంశాలపై చాలానే ఆలోచించానని.. తన ఇంట్లోనూ చర్చించినట్లు వివరించింది. జస్టిస్ హేమ కమిటీ ఏర్పాటుకు కారణమైన డబ్ల్యూసీసీని అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతిచోటా చేయాలని తాను ఆశిస్తున్నానని.. మహిళలకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కిరీక పని ప్రదేశాల్లో సురక్షితమైన వాతావరణం కల్పించడం కీలమని పేర్కొంది. ఇంట్లో కంటే ఎక్కువగా వర్క్ ప్లేస్లోనే ఉంటున్నామని.. ఈ క్రమంలోనే సురక్షితమైన వాతావరణం చాలా ముఖ్యమని నివేదా థామస్ తెలిపింది.
#NivethaThomas responded on #HemaCommitteeReport at #35Chinnakathakadhu Promotions pic.twitter.com/FvtbZJZCYB
— Ramesh Pammy (@rameshpammy) August 31, 2024