అహ్మదాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో నివాసిత ప్రాంతాల్లో మొసళ్లు సంచరిస్తున్నాయి. దీంతో జనం భయపడిపోతున్నారు. ఒక కుక్కను మొసలి నోట కరుచుకోగా మరో నాలుగు మొసళ్లు అనుసరిస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియలో వైరల్ అయ్యింది. (Crocodiles Drag Dog) గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వడోదరను వరద నీరు ముంచెత్తింది. అక్కడి విశ్వామిత్ర నది పొంగిపొర్లుతోంది. దీంతో అందులోని వందలాది మొసళ్లు వడోదరలోని నివాసిత ప్రాంతాల్లోకి చేరుతున్నాయి. ఇళ్ల లోపల, పైకప్పులపై మొసళ్లను చూసి ప్రజలు భయపడిపోతున్నారు. ఒక కుక్కను మొసలి నోట కరుచుకోగా మరో నాలుగు మొసళ్లు దానిని అనుసరించాయి. ఈ భయానక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, గుజరాత్లో కురుస్తున్న భారీ వర్షాలకు విశ్వామిత్ర నదికి వరద పోటెత్తింది. దీంతో వడోదర వీధులన్నీ జలమయమయ్యాయి. విశ్వామిత్ర నదిలో సుమారు 300 భారీ మొసళ్లు ఉన్నట్లు తెలుస్తున్నది. దీంతో భారీ వర్షాలకు నీట మునిగిన వడోదర నివాస ప్రాంతాల్లో ఈ మొసళ్లు కనిపిస్తున్నాయి. ఈ మొసళ్లు 12 నుంచి 15 అడుగుల పొడవు ఉన్నాయి. ప్రజలు వీటిని గుర్తించకపోతే హాని జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో వడోదరలోని పలు ప్రాంతాల్లో మొసళ్లు కనిపించడంపై ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
वडोदरा की विश्वामित्री नदी में एक साथ दिखाई दिए 5 मगरमच्छ…शिकार को नदी में खींच कर ले जा रहे 5 मगरमच्छों का वीडियो आया सामने#VishwamitriRiver #Vadodara #GujaratRains #GujaratFloods #Crocodile pic.twitter.com/DN8WtwH3mG
— News Jungal Media Pvt. Ltd. (@newsjungal) August 31, 2024