దుబాయ్: ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(Axar Patel) తలకు గాయమైంది. ఆసియాకప్‌లో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. అయితే ఆదివారం పాకిస్థాన్‌తో జరిగే సూపర్ ఫోర్ కేటగిరీ మ్యాచ్‌లో అతను ఆడేది డౌట్‌గా కనిపిస్తోంది. 15వ ఓవర్లో హమ్మద్ మీర్జా ఇచ్చిన క్యాచ్‌ను అందుకోబోయి అక్షర్ కిందపడ్డాడు. ఆ సమయంలో అతని తల నేలకు బలంగా తగిలింది. ఆ తర్వాత వెంటనే అతను ఫీల్డ్ వదిలి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాడు. మ్యాచ్ ముగిసే వరకు అతను మళ్లీ మైదానంలోకి రాలేదు. ఛేజింగ్ సమయంలో అక్షర్ కేవలం ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా 21 రన్స్ తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ బ్యాటర్‌గా రాణించాడు అతను 13 బంతుల్లో 26 రన్స్ చేశాడు. నాలుగో వికెట్‌కు సంజూ శాంసన్‌తో కలిసి అతను వేగంగా 45 రన్స్ జోడించాడు. ఒకవేళ పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు అక్షర్ దూరం అయితే, అప్పుడు త్రీ స్పిన్నర్ ఫార్మాలతో ఇండియా బరిలోకి దిగేది కష్టమే అవుతుంది. ఒమన్‌తో మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తికి రెస్ట్ ఇచ్చారు. అయితే ఆదివారం జరిగే మ్యాచ్‌లో అతను ఆడే అవకాశం ఉంటుంది. మరో స్పెషలిస్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. ఆల్‌రౌండర్ విషయానికి వస్తే రియాన్ పరాగ్ లేదా వాషింగ్టన్ సుందర్‌కు జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉంటాయి.