IPL 2024 MI vs DC : ముంబైలోని వాంఖడేలో స్టేడియంలో ముంబై ఇండియన్స్(Mumbai Indians) మరో వికెట్ కోల్పోయింది. దంచికొడుతున్న ఓపెనర్ ఇషాన్ కిషన్(42) ఔటయ్యాడు. అక్షర్ పటేల్ ఓవర్లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో, ముంబై 111 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆడుతున్నాడు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ క్రీజులోకి వచ్చాడు.
టాస్ ఓడిన ముంబైకి ఓపెనర్లు శుభారంభమిచ్చారు. తొలి వికెట్‌కు రన్స్ జోడించారు. అయితే అక్షర్ పటేల్ సూపర్ బంతితో రోహిత్ శర్మ(49)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. స్వల్ప వ్యవధిలోనే రెండు కీలక వికెట్లు పడిన ముంబైని ఇషాన్, పాండ్యాలు ఆదుకునే ప్రయత్నం చేశారు.