దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో పాకిస్థాన్‌పై ఇండియా ఇరగదీసింది. ఆ విక్టరీలో విరాట్ కోహ్లీ సెంచరీ ప్రత్యేకమైంది. ఇక టీమిండియా గెలుపులో అక్షర్ పటేల్ కూడా కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో అతనికి ఫీల్డర్ మెడల్ అందజేశారు. మాజీ క్రికెటర్ , మిస్టర్ ఐసీసీగా అవార్డు గెలుచుకున్న శిఖర్ ధావన్ డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చి.. బెస్ట్ ఫీల్డర్ మెడల్‌ను అక్షర్ పటేల్‌కు అందజేశాడు. అక్షర్ పటేల్ ఆ మ్యాచ్‌లో డైరెక్ట్ త్రోతో ఓ రనౌట్ చేశాడు. ఓ క్యాచ్ కూడా అందుకున్నాడు. ప్లేయర్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన ప్రజెంటేషన్ సెర్మనీకి చెందిన వీడియోను బీసీసీఐ అప్లోడ్ చేసింది.
𝗗𝗿𝗲𝘀𝘀𝗶𝗻𝗴 𝗥𝗼𝗼𝗺 𝗕𝗧𝗦 | 𝗙𝗶𝗲𝗹𝗱𝗲𝗿 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗠𝗮𝘁𝗰𝗵 | #PAKvIND
A man with a golden bat and a golden heart 🤗
When ‘Mr. ICC’ turned up in #TeamIndia’s dressing room to present the fielding medal 😎
WATCH 🎥🔽 #ChampionsTrophyhttps://t.co/k2kXs5CSRG
— BCCI (@BCCI) February 24, 2025