హైదరాబాద్ : ఐపీఎల్ 2026(IPL 2026) ప్లేఆఫ్ స్థానాలు ఖరారైన నేపథ్యంలో ఢిల్సీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్(Axar Patel) ఆసక్తర వ్యాఖ్యలు చేశాడు. ఈ సారి కప్ ఏ జట్టు సొంతం చేసుకుంటుందో ముందే చెప్పేశాడు. డీసీ, కేకేఆర్ మ్యాచ్ అనంతరం అక్షర్ మీడియాతో మాట్లాడారు. ప్లేఆఫ్ అర్హత సాధించిన జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యంత బలమైన జట్టు అని, ఈ సారి కప్ సన్‌రైజర్స్ సొంతం చేసుకుంటుందని అక్షర్ పటేల్ అభిప్రాయపడ్డారు. ఎస్ఆర్హెచ్తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి.
ఈ క్రమంలో అక్షర్ పటేల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన టాప్ టెన్‌లో ఎస్ఆర్హెచ్కు చెందిన ముగ్గురు బ్యాటర్లు ఉన్నారు. హెన్రిచ్ క్లాసెన్ 14 మ్యాచ్‌లలో 50.50 సగటు, 159.47 స్ట్రైక్ రేట్‌తో 606 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో ఉన్నాడని అక్షర్ గుర్తు చేశారు. ఇషాన్ కిషన్ 14 మ్యాచ్‌లలో 40.64 సగటు, 178.36 స్ట్రైక్ రేట్‌తో 569 పరుగులు చేసి ఆరో స్థానంలో ఉన్నాడు. మరోవైపు, ఓపెనర్ అభిషేక్ శర్మ 14 మ్యాచ్‌లలో 43.31 సగటు, 206.22 స్ట్రైక్ రేట్‌తో 563 పరుగులు చేసి ఏడో స్థానంలో ఉన్నాడు.వీరు చెలరేగితే ఆపడం ఎవరి తరం కాదన్నారు.
ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలిచింది. వారి దూకుడైన బ్యాటింగ్ విధానం ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తుందని పేర్కొన్నాడు. అలాగే ఎస్ఆర్హెచ్ బౌలర్లు కూడా బాగా రాణిస్తున్నారు. వారి టాప్ ఆర్డర్ ట్రావిస్ హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్, జట్టుకు మెరుపు ఆరంభాలను అందించి, మిడిల్ ఆర్డర్‌కు స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం కల్పిస్తున్నారు. దూకుడైన వారి బ్యాటింగ్‌ను అడ్డుకోవడం ఏ జట్టుకైనా అంత సలువు కాదన్నారు. అందుకే తాను ఎస్ఆర్హెచ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు.
కాగా, బుధవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్తో తలపడనుంది. లీగ్ దశలో ఎస్ఆర్హెచ్ 18 పాయింట్లతో మూడో స్థానంలో నిలవగ, ఆర్ఆర్ 16 పాయింట్లతో ముగించింది. మరోవైపు, మంగళవారం ఆర్సీబీ, జీటీతో తలపడనున్నది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టు ఎస్ఆర్హెచ్- ఆర్ఆర్‌ల మధ్య గెలిచిన జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది.